Chiranjeevi and Nayanthara: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం కేవలం సంక్రాంతి ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని వస్తోంది. ప్రతీ ఏడాది సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే జానర్ తో వచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో వస్తున్నాడు. అయితే సంక్రాంతి ఆడియన్స్ కోసం తీసిన ఈ సినిమా, ఇప్పుడు సంక్రాంతికి రావడం కష్టమేనేమో అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పాకుతోంది. కారణం రీసెంట్ గానే చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన రషెస్ ని చూశాడట. అంతా బాగానే ఉంది కానీ, కొన్ని సన్నివేశాలు మెగాస్టార్ కి ఎందుకో పూర్తి స్థాయి లో సంతృప్తి ని ఇవ్వలేదట. మరోసారి రీ షూట్ చేస్తే కానీ సంతృప్తి చెందేలా లేదని చిరంజీవి అనిల్ రావిపూడి ని అడుగుతాడు అట.
దీంతో గత రెండు రోజులుగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ జరుగుతున్నాయి. అంతే కాకుండా చిరంజీవి , నయనతార కాంబినేషన్ లో తెరకెక్కిన కొన్ని సన్నివేశాలను కూడా రీ షూట్ చేయాల్సి ఉందట. కానీ ఆమె హైదరాబాద్ అయితే వచ్చి షూటింగ్ చేయలేనని దర్శక నిర్మాతలకు ముఖం మీదనే చెప్పేసిందట. అంతే కాకుండా ఆమె టీం ని మైంటైన్ చేయడం, హోటల్ అకామడేషన్స్, ఇవన్నీ కూడా అదనంగా బడ్జెట్ ని పెంచే అంశాలే. అందుకే ఆమె హైదరాబాద్ కి రాలేను అని చెప్పినా దర్శక నిర్మాతలు పెద్దగా ఒత్తిడి చేయలేదు. అయితే ఈ రీ షూట్ కోసం చెన్నై లో అయితే నయనతార వస్తానని చెప్పిందట. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రీ షూట్ కోసం చెన్నై కి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ఒక నాలుగు రోజుల పాటు కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తారట.
మెగాస్టార్ స్థాయి వ్యక్తి సినిమాలో నటిస్తున్నప్పుడు ఆర్టిస్టులు ఎలాంటి డిమాండ్ పెట్టకుండా వచ్చి పని చేస్తుంటారు. మొట్టమొదటిసారి మెగాస్టార్ కి ఆరిస్టు నుండి నేను హైదరాబాద్ కి వచ్చి షూట్ చెయ్యలేను, అవసరమైతే మీరే చెన్నై కి వచ్చి చేసుకోండి అన్నట్టుగా ఆమె మాటలు ఉన్నాయి. నేటి తరం హీరో అయ్యుంటే పెద్ద గొడవలు జరిగేవి. కానీ చిరంజీవి చెన్నై వెళ్లి షూటింగ్ చేసాడంటే, ఈ వయస్సులో కూడా ఆయనకు సినిమా మీద ఎంత డెడికేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ మెగాస్టార్ స్థాయి వ్యక్తి ఇలా తగ్గి వెళ్లడం అనేది అభిమానులకు అసలు నచ్చడం లేదు. మరోపక్క నయనతార ని మెగాస్టార్ వద్దనే ఇంతటి యాటిట్యూడ్ చూపిస్తావా?, ఎంత పొగరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.