Nayantara: లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. సినిమాలతో పాటు.. బిజినెస్‌లోనూ దుమ్మురేపుతోంది. ఈ బ్యూటీ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దుబాయ్‌కి చెందిన ఒక ఆయిల్ కంపెనీలో దాదాపుగా రూ.100కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక, నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి ఇప్పటికే రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. చాయ్‌వాలే, లిప్ బామ్ బ్రాండ్స్‌లేనూ వీరికి పెట్టుబడులు ఉన్నాయి. నయన్ పారితోషికం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది.

దాదాపు ఒక్కో సినిమాకి నయన్ నాలుగు కోట్లు తీసుకుంటుంది. అయితే, నయనతార ఆ డబ్బును కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాతగా కూడా ఓ చిత్రం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నట్టు నయనతార రెస్టారెంట్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టబోతోందని టాక్ ఉంది. ఎలాగూ ‘చాయ్ వాలా’ అనే కాఫీ/టీ షాప్ ల కంపెనీలో 12 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఆ కంపెనీ చెన్నైలో అనేక ప్రాంతాల్లో టీ రెస్టారెంట్లు నడుపుతూ ఉంది. ఈ కంపెనీ యాజమాన్యంతో నయనతారకి ముందు నుండి మంచి అనుబంధం ఉంది.
Also Read: జగ్గారెడ్డిని కంట్రోల్ చేసిన సీఎల్పీ.. ఒంటరిగా వద్దు.. ఉమ్మడిగా చేద్దాం..!
ఆ కంపెనీకి చాలా గ్రోత్ ఉంది. నయనతారకు ఇంకా భవిష్యత్తులో వేరే వ్యాపారుల్లో కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉంది. అలాగే, తన అభిరుచికి, మరియు తనకు ఇష్టమైన మెన్యు కి అనుగుణంగా ఒక హై క్లాస్ రెస్టారెంట్ ను పెట్టాలనే ప్లాన్ లో కూడా ఉంది నయనతార. మొత్తానికి నయనతార తన భవిష్యత్తు మొత్తాన్ని బిజినెస్ లోనే ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే నయన్ వయసు కూడా పై పడింది. 35 ఏళ్ళు దాటాయి నయనతారకు. మహా అయితే, హీరోయిన్ గా నయనతార కెరీర్ మరో రెండేళ్లు ఉంటుంది. అందుకే, తెలివిగా ఈ లోపే వేరే ఫీల్డ్ లో పెట్టుబడులు పెట్టి… ఫ్యూచర్ ను బాగానే ప్లాన్ చేసుకుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ తో కలిసి ఉంటున్న నయనతార త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ, ఆ పెళ్లి ఎప్పుడు అనేది క్లారిటీ మాత్రం లేదు.
Also Read: కరోనా కల్లోలంలోనూ ఆగని కోళ్ల పందేలు.. ఈ సారి డబ్బుల కట్టల్లో దొంగ నోట్లు..!
[…] Prashant Kishore: ఆంద్రప్రదేశ్ లో రాజకీయ వేడి అప్పడే మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయమున్నా అధికార పార్టీ వైసీపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గతంలోనే జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ర్ట వ్యాష్ర్టవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారని వాటి నివేదికల ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెప్పారు. దీంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది. […]
[…] Subbareddy: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ టికెట్ వైసీపీ ఇవ్వబోతున్నదని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, అటువంటి వార్తలు నమ్మొద్దని చిరంజీవి కోరారు. అంతటితో కథ ముగిసింది. కానీ, టీటీడీ చైర్మన్, వైసీపీ అధినేత జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ ప్రజెంట్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతున్నాయి. […]
[…] Kohli: క్రికెట్ క్రీడను భారతీయులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఈ సంగతి అలా ఉంచితే.. క్రికెట్ టీమ్‌లో గత కొద్ది కాలంగా అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులన్నీ కూడా కోహ్లీ చుట్టూ తిరుగుతుండటం గమనించ దగ్గిన విషయం అవుతున్నది. గతంలో వన్డే, టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ తాజగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటన కూడా చేశారు. […]