Navya Nair fined Rs 1.14 lakh: కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకపోయినప్పటికీ.. ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అపరాధిగా తలవంచాల్సి ఉంటుంది. అవసరమైతే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మన పరిభాషలో చెప్పాలంటే దానిని చేయని తప్పుకు శిక్ష అనొచ్చు. అలాంటిదే ఈ నటికి ఎదురైంది. జరిగిన సంఘటనలో ఆమె తప్పులేదు. ఆమె కావాలని చేయలేదు. కాకపోతే చట్టం ముందు తలవంచక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వాస్తవికతకు పెద్దపీటవేసే మలయాళ చిత్ర పరిశ్రమలో నవ్య నాయర్ అనే మహిళ నటీమణిగా కొనసాగుతోంది. ఆమె అనేక సినిమాలలో నటించింది. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈమె నటన అద్భుతంగా ఉంటుంది. పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. నవ్య ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ప్రాంతంలో విచిత్రమైన అనుభవం ఎదురయింది. అక్కడి విమానాశ్రయంలో ఆమెకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఆమె సాధారణ లగేజ్ తోనే విమానాశ్రయంలో ప్రవేశించి బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. వాస్తవానికి ఆమె బ్యాగులో ఎటువంటి చట్ట వ్యతిరేక వస్తువులు లేవు. మందు గుండు సామాగ్రి లేదా మాదకద్రవ్యాలు వంటివి లేవు. పోనీ బంగారం లేదా ఇల్లీగల్ వస్తువులు కూడా లేవు. అయినప్పటికీ కూడా అక్కడ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. చాలాసేపు ప్రశ్నించారు. దీంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడిపోయింది. ఇంతకీ ఆస్ట్రేలియా అధికారులు ఆమెను అడ్డగించడానికి ప్రధాన కారణం మల్లెపూలు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
కావ్య నాయక్ తన బ్యాగులో మల్లెపూలు తీసుకెళ్తున్నారు. మల్లెపూలు తీసుకెళ్తున్నారనే కారణంగా ఆస్ట్రేలియా అధికారులు 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు లక్ష 14 వేల రూపాయలను జరిమానాగా విధించారు. వాటిని 28 రోజుల లోపు చెల్లించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావ్య తన హ్యాండ్ బ్యాగ్ లో మల్లెపూలు తీసుకెళ్తోంది అనేది నిజం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో అవి దొరకవు కాబట్టి ఆమె తీసుకెళ్తోంది. అయితే మల్లెపూలు అలా తీసుకురావడాన్ని ఆస్ట్రేలియా అధికారులు తప్పుపట్టారు.. అంతేకాదు ఇలా హ్యాండ్ బ్యాగ్ లో మల్లెపూలు తీసుకురావడానికి తాము ద్రోహంగా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. తాను నటిని అని చెప్పినప్పటికీ ఆస్ట్రేలియా అధికారులు వదిలిపెట్టలేదని కావ్య వాపోయింది. విచారణ పేరుతో చాలాసేపు నిలబెట్టారని.. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానని కావ్య వాపోయింది. అయితే ఆస్ట్రేలియా నిబంధనలు ప్రకారం అలా మల్లెపూలు తీసుకురావడం చట్ట వ్యతిరేకమని తెలుస్తోంది. అందువల్లే అక్కడే అధికారులు ఆ స్థాయిలో అపరాధ రుసుము విధించారని సమాచారం. కావ్య కు ఎదురైన సంఘటన నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మల్లెపూలు తీసుకెళ్తే ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని మలయాళ సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.