Naveen Polishetty: ఈ సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వాటిల్లో ఒకటి ‘అనగనగా ఒక రాజు'(Anaganaga oka raju) చిత్రం. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసి యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), ఈ సినిమాతో కూడా మరో భారీ హిట్ ని అందుకొని సత్తా చాటాడు. సినిమా విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో పాల్గొని, జనాలకు ఈ చిత్రాన్ని బాగా దగ్గర చేయడంలో నవీన్ పోలిశెట్టి ఎంత కష్టపడ్డాడో, సినిమా విడుదలయ్యాక కూడా ప్రొమోషన్స్ చేస్తూ, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. జిల్లాల వారీగా మూవీ టీం నిర్వహిస్తున్న సక్సెస్ టూర్స్ లో నవీన్ పోలిశెట్టి కూడా భాగం అయ్యాడు. నిన్న రాజమహేంద్రవరం లోని అప్సర థియేటర్ కి విచ్చేసింది మూవీ టీం. ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళు షూటింగ్స్ చేయాలనీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడడం నా హృదయాన్ని తాకింది. అందువల్లే మేము ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక శాతం అనగనగా ఒక రాజు మూవీ షూటింగ్ జరుపుకున్నాము. ఇక్కడ మాకు షూటింగ్ చేసుకోవడం కోసం అధికారులు అనుమతులు ఇచ్చి మాకు పూర్తి స్థాయిలో సహకరించారు, ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారు. అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
మరోపక్క ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఇలా సాధారణంగా ఏ సినిమా అయినా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కనీసం వారం రోజుల సమయం అవసరం ఉంటుంది. కానీ ఈ చిత్రానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే పట్టిందంట ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలు ఈ చిత్రం అప్పుడే వంద కోట్ల గ్రాస్ ని అందుకుంది ప్రచారం చేస్తున్నారు కానీ, ఇప్పటికైతే ఆ మార్కుని చేరుకోలేకపోయింది ఈ చిత్రం. కానీ ఫుల్ రన్ లో కచ్చితంగా ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
