https://oktelugu.com/

Naveen Polishetty : ట్రావెలర్ అన్వేష్ ను అచ్చుగుద్దినట్టు దించేసి కామెడీ చేసిన హీరో నవీన్.. వైరల్ వీడియో…

నవీన్ పోలిశెట్టి రీసెంట్ గా చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక వరుసగా ఇండస్ట్రీలో హిట్లు కొడుతూ హ్యాట్రిక్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2023 / 09:24 PM IST
    Follow us on

    Naveen Polishetty : సినిమా ఇండస్ట్రీలో జాతి రత్నాలు అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న హీరో నవీన్ పోలిశెట్టి… ఈయన నటుడు అనే పదానికి సరిగ్గా యాప్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఏ క్యారెక్టర్ ని అయిన ఆలవోక చేసి మెప్పించే అంత సత్తా ఉన్న నటుడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎవరినైనా సరే ఇమిటేట్ చేయడంలో ఆయన చాలా సిద్ధహస్తుడు.ఒకసారి ఆయనని కనుక మనం చూసుకున్నట్లయితే సినిమాల్లో ఒకసారి చేసిన క్యారెక్టర్ ని మళ్ళీ మళ్ళీ చేయకుండా ప్రతి సినిమా లో ఒక కొత్త క్యారెక్టర్ ని చేస్తూ ఉంటాడు. స్టోరీ ల ఎంపిక లో ఆయన చాలా క్లారిటీ గా ఉంటాడు కాబట్టే ఆయన తక్కువ సినిమాలు చేసిన కానీ మంచి సినిమాలు చేస్తాడు. అయితే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచే అన్వేష్ ట్రావెలర్ గురించి మనందరికీ తెలుసు…

    ప్రపంచంలోఉన్న చాలా దేశాలను తిరుగుతూ మంచి వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న చాలా ప్లేసెస్ ని ఆయన విజిట్ చేసి మనకు ఆ వీడియోలు కూడా పెడుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ యూట్యూబర్ గా కూడా కొనసాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలో నవీన్ పోలిశెట్టి అన్వేష్ ని ఇమిటేట్ చేస్తూ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి సేమ్ అన్వేష్ ఎలా మాట్లాడుతాడో అచ్చు గుద్దినట్టుగా అలాగే ఆయనలాగే మాట్లాడుతూ ఆ వీడియోలో చాలా బాగా చేశారు.దానికి తగ్గట్టుగానే ఆ వీడియో చూసిన చాలామంది అభిమానులు కూడా నవీన్ పోలిశెట్టిని అప్రిషియేట్ చేస్తున్నారు. నార్మల్ గా మిమిక్రీ చేయడం వేరు వాళ్ళ హావభావాలను కూడా వాళ్ల లాగే చేసి మెప్పించడం వేరు… నవీన్ అన్వేష్ ని మిమిక్రీ చేస్తూ ఆయన హావ భావాలను సైతం చాలా క్లియర్ గా ఆయన ఎలాగైతే చేస్తాడో అలాగే ఆయన లానే దింపేశాడు అని చాలామంది నవీన్ పోలిశెట్టి అభిమానులు కూడా నీలో మామూలు నటుడు లేడు అన్న అంటూ నవీన్ ని పొగుడుతున్నారు…

    ఇక ఇదిలా ఉంటే నవీన్ పోలిశెట్టి రీసెంట్ గా చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక వరుసగా ఇండస్ట్రీలో హిట్లు కొడుతూ హ్యాట్రిక్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇలాంటి నవీన్ ప్రస్తుతం మరికొన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి మ్యాడ్ సినిమాని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ కావడం విశేషం. ఇక నవీన్ మంచి సినిమాలు చేస్తూ నటుడిగా పరిణితిని సాధిస్తూ అలాగే అతని అభిమానులను కూడా అలరించాలని కోరుకుందాం…