Anaganaga Oka Raju Trailer Review: ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోయే సినిమాల్లో ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ఈ సినిమా, జనవరి 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి మొదట్లో ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. స్టోరీ నవీన్ పోలిశెట్టి నే అందించాడు. ఆ తర్వాత నవీన్ కి చిన్నపాటి యాక్సిడెంట్ జరగడం, ఆయన చెయ్యి విరగడం తో కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో కళ్యాణ్ శంకర్ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి షిఫ్ట్ అవ్వడం తో మారి అనే దర్శకుడిని తీసుకొచ్చారు. మొదట్లో శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకున్నారు, కానీ మధ్యలో గ్యాప్ రావడం తో ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది, ఆమెకు బదులుగా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు.
టీజర్ పర్వాలేదు అనిపించింది, పాటలు ఒకటి రెండు పర్వాలేదు అనిపించాయి. ఇక నేడు కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి నుండి ఆడియన్స్ ఎలాంటివి కోరుకుంటారో, అవన్నీ ఈ సినిమాలో ఉన్నట్లు గా ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతోంది. నవీన్ పోలిశెట్టి మార్క్ డైలాగ్స్ బాగా అనిపించాయి. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ మూడ్ లోకి తీసుకొచ్చారు కదా రా అనే డైలాగ్ బాగా పేలింది. అదే విధంగా నోట్ల కట్ట తీసుకొచ్చి, హుండీలో వేద్దామని అనుకుంటే , హుండీ కన్నం చిన్నగా ఉండడం, చిల్లరోళ్ల కోసం వేరే హుండీని మైంటైన్ చేయండి అనడం వంటివి నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి.
అయితే ఆయన రైటింగ్ లో జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV ప్రభావం బాగా కనిపిస్తోంది. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి తో కూడా డైరెక్టర్ మంచి కామెడీ చేయించినట్టు ఉన్నాడు. గుడిలో దేవుడికి మొక్కుతున్న సమయంలో పూజారి తిరిగి దండం పెట్టుకో అమ్మా అని చెప్పినప్పుడు ఆమె వెనుకవైపు తిరిగి దండం పెట్టుకోవడం వంటివి ఫన్నీ గా అనిపించాయి. మొత్తం మీద ట్రైలర్ మొత్తం సంక్రాంతి పండుగ వాసన కనిపించింది. కేవలం సంక్రాంతి కోసమే డిజైన్ చేసిన సినిమా అన్నట్లు గా ఉంది. సరైన టాక్ వస్తే, నవీన్ పోలిశెట్టి ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టేస్తాడు అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కానీ, వంద కోట్ల గ్రాస్ మార్కుని మాత్రం అందుకోలేకపోయాయి, ఈ సినిమా కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.