Vadde Naveen Is In Bigg Boss 6: బుల్లితెర లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి ప్రేక్షకాదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికే 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ ని అతి త్వరలోనే ప్రారంభించుకోబోతుంది..బిగ్ బాస్ సీసన్ 5 పూర్తి అయినా వెంటనే OTT వెర్షన్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రారంభించగా అక్కడ కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..ఈ OTT వెర్షన్ లో పాత సీసన్స్ కి సంబంధించిన కొంతమంది కంటెస్టెంట్స్ కూడా పార్టిసిపేట్ చెయ్యగా..బిందు మాదవి టైటిల్ విన్నర్ గా నిలిచింది..ఇక సీసన్ 4 రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్..ఈ సీసన్ లో కూడా రన్నర్ గా నిలిచాడు..ఇక త్వరలోనే ప్రారంభం కాబోతున్న సీసన్ 6 గురించి సోషల్ మీడియా లో అప్పుడే పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి..ముఖ్యంగా సీసన్ 6 లో పాల్గొనబోయ్యే కంటెస్టెంట్స్ గురించి రోజుకో వార్త ప్రచారం అవుతుంది.

Also Read: Chor Baazar 3 Days Collections: ‘చోర్ బజార్’ 3 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే ?
లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే బిగ్ బాస్ సీసన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయించేందుకు స్టార్ మా యాజమాన్యం ప్రముఖ హీరో వడ్డే నవీన్ ని సంప్రదిస్తునట్టు సమాచారం..సినిమాలకు దూరమైనా తర్వాత వద్దే నవీన్ ఎక్కడ కనిపించలేదు..అప్పటి హీరోలందరూ ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కరు ఈమధ్య ఇంటర్వూస్ లో పాల్గొంటున్నప్పటికీ వద్దే నవీన్ మాత్రం మీడియా ముందుకి వచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు..కాబట్టి అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ సీసన్ 6 కి తీసుకుంటే కచ్చితంగా షో కి అట్రాక్షన్ గా మారుతాడని బిగ్ బాస్ టీం ఆలోచన..కానీ వద్దే నవీన్ ఇందుకు ఒప్పుకోలేదట..దీనితో స్టార్ మా యాజమాన్యం కనివిని ఎరుగని పారితోషికం ని వద్దే నవీన్ కి ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది..మరి ఈ ఆఫర్ ని ఆయన ఒప్పుకుంటాడా లేదో చూడాలి..ప్రముఖ నిర్మాత వద్దే రమేష్ కుమారుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన నవీన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో గా ఎదిగాడు..ముఖ్యంగా ఈయనకి లేడీస్ లో ఇప్పటికి మంచి ఫాలోయింగ్ ఉంది..ఆయన సినిమాలు టీవీ లో వచినప్పుడుడల్లా బాగానే చూస్తారు..అలాంటి ఫేమ్ ఉన్న వద్దే నవీన్ బిగ్ బాస్ లోకి అడుగుపెడితే కచ్చితంగా TRP రేటింగ్స్ అదిరిపోతాయని అంచనా వేస్తున్నారు..మరి వద్దే నవీన్ బిగ్ బాస్ లో పాల్గొంటాడా లేదా అనేది అతి త్వరలోనే తెలియనుంది..ఈ సీసన్ 6 జులై ఆఖరులో కానీ..లేదా సెప్టెంబర్ 4 తేదీన కానీ ప్రారంభం కానుంది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్