Bro Movie: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బాల్యం నటిగా ఎంతో మంది అభిమానులను గెలుచుకున్నారు అవికా గోర్. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి విజయం సాధించింది ఆ తర్వాత వచ్చిన ‘సినిమా చూపిస్త మామ, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాల్లో హీరోయిన్ గుర్తింపు పొందింది. అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

కార్తిక్ తుపురాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు “బ్రో ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఎందుకో తెలీదు నాకు బాగా ఇష్టమైనవన్నీ ఎప్పుడూ నాకు దూరమయ్యాయి. ఎటు చూసినా ఒక్కటే దొరికేది.. ఒంటరితనం’’ అంటూ నవీన్‌చంద్ర చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలానే ఈ ట్రైలర్ లో అన్నయ్యా నేను ఉన్నంతవరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. దాని కోసం నేను ఏదైనా చేస్తాను. ఏమైనా దాటి వస్తాను అని అంటున్నారు అవికా గోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన ఓ ముచ్చటైన కుటుంబకథా చిత్రమిది. నవంబర్ 26న సోనీ లైవ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Rekindle the bond in a beautiful fairy tale! Presenting the trailer of #BRO 👫
Streaming on @SonyLIV from 26th November!
▶️ https://t.co/sKgnOZdmzj#BROonSonyLIV@Naveenc212 @Avika_n_joy @Saironak3 @SanjanaSarathy @Kat_thupurani #ShekarChandra @bhaskarabhatla pic.twitter.com/7Q2WimF1mZ
— Actor Naveen Chandra (@Naveenc212) November 20, 2021