IFFI: ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకు 52 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరుపు కోవడానికి సిద్ధం అవుతున్నాయి.అయితే దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు వేడుకలను గోవా లో జరగనున్నాయి. 52 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఒక తెలుగు సినిమా ఎంపిక అయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకున్న “నాట్యం”ఎంపికయింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం సంధ్య రాజు ప్రధాన పాత్రలో కమల్ కామరాజు కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాం టాలీవుడ్ లో ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది.

ఈ ఏడాది అక్టొబర్ 22 న విడుదల అయినా ఈ సినిమా కూచిపూడి నాట్యం మీదుగా తెరకెక్కింది. ఈ మూవీ ని త్వరలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించ నున్నారు. ఈ ప్రదర్శన చేయడానికి అన్ని దేశాల నుంచి ఫీచర్ విభాగం లో మొత్తం 221 సినిమా లు ఎంట్రీ ఇవ్వగా అందు లో నుంచి 25 సినిమా లను మాత్రమే ఎంపిక చేశారు. అలాగే నాన్ ఫీచర్ విభాగంలో 203 సినిమాలు ఎంట్రీ ఇవ్వగా అందులో నుంచి 20 సినిమాలను ఎంపిక చేశారు. అందులో ఇటీవలే విడుదలైన “నాట్యం” మూవీ ఎంపిక కావడం విశేషం.
ఈ చిత్రం లో రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, ‘శుభలేఖ’ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన తదితరులు నటించారు. ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. అలానే ఈ సినిమాను చూసిన బాలకృష్ణ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. మరుగున పడుతున్న కళకు తిరిగి ప్రాణం పోసి… వాటిని తెరపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ నాట్యం కేవలం సినిమా కాదని..ఒక కళాఖండమని కొనియాడారు.