Natural Star Nani: మన టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోలలో ఒక్కరు న్యాచురల్ స్టార్ నాని..విభిన్నమైన కథాంశాలతో ఎప్పుడు మన ముందుకి వచ్చే నాని లేటెస్ట్ తో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే నాని ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలు అన్ని సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలే..భలే భలే మగాడివోయ్ లాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా చేసి చాలా కాలమే అయ్యింది..ఇప్పుడు తన అభిమానుల కోసం చాలా ఏళ్ళ తర్వాత ఆయన మళ్ళీ పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో ‘అంటే సుందరానికి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..’బ్రోచేవారు ఎవరురా’ , ‘మెంటల్ మదిలో’ మరియు ‘ గోవిందా గోవిందా’ వంటి సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో ఈ సినిమా తెరెక్కింది..షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: Prabhas Maruthi Movie: అందుకే అతనితో ఒప్పుకున్నా.. ప్రభాస్ ఫుల్ క్లారిటీ !
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా కథ ని హీరో నాని పూర్తిగా వినకుండానే ఒప్పుకున్నాడు..కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే విని ఎంతో అద్భుతంగా నచ్చడం తో మారు మాట్లాడకుండా వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు..కానీ ఈ సినిమా లో ప్రముఖ హీరోయిన్ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈమెని హీరోయిన్ గా ఎంచుకునే ముందు నాని కి తనకి మధ్య జరిగిన ఒక్క చిన్న చర్చ గురించి ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘పెళ్లైన తర్వాత నజ్రియా గారిని పూర్తి స్థాయి హీరోయిన్ గా నటింపచేయబోతున్న సినిమా ఇదే..కాబట్టి ఆమె ని ఈ సినిమాలో నటించమని ఒప్పించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..నాకు చెప్పినట్టు సగం సినిమా స్టోరీ కాకుండా..పూర్తి కథ చెప్పి ఆమెని ఒప్పించు..ఎలాంటి తేడా రాకూడదు’ అంటూ నాని గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు వివేక్ ఆత్రేయ తెలిపాడు..వివేక్ ఆత్రేయ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ సినిమా విజయం మీద హీరో నాని చాలా గట్టి నమ్మకం తో ఉన్నాడు అట..భలే భలే మగాడివోయ్ సినిమా తన కెరీర్ మొత్తాన్ని ఎలా మలుపు తిప్పిందో..ఈ సినిమా కూడా ఆయన కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అవుతుంది అని నాని బలమైన నమ్మకంతో ఉన్నట్టు సమాచారం..విడుదల అయినా చిన్న చిన్న గ్లిమ్స్ లు కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తో ట్రేడ్ లో కూడా ఈ సినిమా కి మంచి క్రేజ్ ఉంది..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 50 కోట్ల రూపాయిల వరుకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది..ఇక ఈ నెల 20 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..భారీ అంచనాల నడుమ ఈ జూన్ 10 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఆ అంచనాలను ఏ ఎంతవరుకు అందుకుంటుందో చూడాలి.
Also Read: Chiranjeevi-Mahesh Babu: షాకింగ్ : బాధపడుతూ మెసేజ్ లు చేసిన మహేష్ – చిరంజీవి !
Recommended Videos:
[…] […]
[…] Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి తన 154 చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేస్తున్నాడు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఈ చిత్రానికి సంబంధించిన శృతిహాసన్ ఒక లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఆమె ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది. […]
[…] RRR Box Office Collection: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా కొన్నిచోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. […]
[…] […]