Homeఎంటర్టైన్మెంట్Shyam Singaroy: అదరగొట్టిన నాచురల్ స్టార్ నాని... " శ్యామ్ సింగరాయ్ " టీజర్ రిలీజ్

Shyam Singaroy: అదరగొట్టిన నాచురల్ స్టార్ నాని… ” శ్యామ్ సింగరాయ్ ” టీజర్ రిలీజ్

Shyam Singaroy: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి.  నాని ప్రస్తుతం ” శ్యామ్‌ సింగరాయ్‌ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఎమోషనల్, కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన త్వరలోనే పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసేకుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.

natural star nani shyam singaroy movie teaser released

ఈ సినిమా టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా నాలుగు భాషల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్‌ లో  నాని తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా… ఈ టీజర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 24 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  కాగా, చాలా కాలంగా సాలిడ్​ హిట్​కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ సినిమా బ్రేక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular