RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారు. కాగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాట లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన నాటు నాటు పాట ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిందని చెప్పాలి. యూట్యూబ్ లో ఈ పాట దుమ్మురేపుతుంది మిలియాన్లలో వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ సృష్టిస్తుంది. తాజాగా ఈ పాట 75 మిలియన్స్ వ్యూస్ సాధించింది. స్వతహాగానీ మంచి డాన్సర్స్ అయిన వీరిద్దరు కలిసి ఈ పాటలో అభిమానులకు ఓ రేంజ్ ట్రీట్ ఇచ్చారు. మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఎనర్జీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అలాగే… లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖనిలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. కాగా త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముంబై వేదికగా ఈవెంట్ ను నిర్వహించి సల్మాన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించున్నట్లు టాక్ వినిపిస్తుంది.