
RRR – Natu Natu Steps : తెలుగు పాటకు ఆస్కార్ రావడం ఊహించని పరిణామం. అసలు నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకునే అర్హత ఉందా? అనే చర్చ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సాధారణంగా ఆస్కార్ ఆర్ట్ సినిమాలకు, క్లాస్ వర్క్ కి మాత్రమే ఇస్తారనే ఓ వాదన ఉంది. అది నిజం కాదని నాటు నాటు నిరూపించింది. క్లాస్ మాస్ అనేది ముఖ్యం కాదు… సృజన ముఖ్య ఉద్దేశం జనాల్ని రంజింప చేయడం. ఆ విషయంలో సక్సెస్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ సాంగ్ కి ఎంత క్రేజ్ ఉందో ఆస్కార్ వేదికగా రుజువైంది. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అచ్చ తెలుగు భాషలో నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
సాంగ్ ని ఆద్యంతం ఆస్వాదించిన ప్రపంచ సినిమా ప్రముఖులు… స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అసలు ఇండియన్ ఆడియన్స్ లో ఏ మూలో నాటు నాటు సాంగ్ పట్ల తక్కువ భావన ఉంది. ఇలాంటి ఓ పాట ఆస్కార్ వరకు వెళ్లడమేంటన్న సందేహాలు ఉన్నాయి. అయితే నాటు నాటు సినిమా దిగ్గజాలకు నచ్చిందని రుజువైంది. వాళ్ళ మక్కువ ప్రత్యక్షంగా కనిపించించింది. కాగా నాటు నాటు సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ మూమెంట్స్ వివరిస్తూ ప్రముఖ ప్రింట్ మీడియాలో ఆర్టికల్ ప్రచురించారు.
నాటు నాటు సాంగ్ లోని స్టెప్స్ క్రమబద్ధంగా బొమ్మల రూపంలో వివరిస్తూ మలయాళ మనోరమ అనే పత్రిక ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇదో అరుదైన విషయంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెటిజన్స్ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. నాటు నాటుకి ఆస్కార్ దక్కడంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పాత్ర చాలా ఉంది. నాటు నాటు కోసం ఆయన యూనిక్ మూమెంట్స్ డిజైన్ చేశారు. దాదాపు నెల రోజులు ఈ సాంగ్ కోసం యూనిట్ కష్టపడ్డారు.
ప్రస్తుతం యుద్ధ భూమిగా మారిన ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చిత్రీకరించారు. షూట్ కి ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్ వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. రెండు వారాలు చిత్రీకరించారు. వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పాల్గొన్న ఈ సాంగ్ కోసం కోట్లు ఖర్చు చేశారు. స్పీడ్ గా సాగె లెగ్ మూమెంట్ లో సింక్ సాధించడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ బాగా కష్టపడాల్సి వచ్చింది. అనేక టేక్స్ తీసుకున్నారట. ఇద్దరూ ఒకేలా చేయాలని పట్టుబట్టిన రాజమౌళి ఆలస్యమైనా పర్లేదని ఆర్ ఆర్ ఆర్ హీరోలను నార తీశారు. వారి శ్రమకు ఏకంగా ఆస్కార్ దక్కింది.