National Film Awards 2023
National Film Awards 2023: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సినీ జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్తమ నటీమణులుగా ఆలియాభట్, కృతిసనన్ లు ఎంపికయ్యారు. ఈ తరుణంలో వీరికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఇంతకంటే అద్భుతమైన సినిమాల గురించి ఎందుకు పట్టించుకోలేదని చర్చలు పెడుతున్నారు. అలాగే తెలుగులోనూ పుష్ప వచ్చిన సమయంలో మరికొన్ని సినిమాలు వచ్చినా వాటికి కనీసం ఒక్క అవార్డు కూడా ఎందుకు ఇవ్వలేదని అంటున్నారు. ఇంతకీ ఏ యే సినిమాలు అవార్డు తీసుకునే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారంటే?
ఉత్తమ చిత్రంగా మాధవన్ హీరోగా నటించిన ‘రాకెట్రీ’ ని ఎంపిక చేశారు. అయితే ఇది మంచి పరిణామామే. కానీ ఈ మూవీ కొన్ని వర్గాలను మాత్రమే ఆకట్టుకుంది. ఇదే సమయంలో అడవుల్లో బతికే వారి నేపథ్యంలో తీసిన ‘జై భీమ్’ సినిమా థియేటర్లకు రాకముందే ప్రతి ప్రేక్షకుడు సినిమాను చూశారు. దీంతో పాటు గరుడ గమన వృషభ వాహన, జనగణమన, సర్పట్టా, గ్రేట్ ఇండియన్ కిచెన్, కర్ణన్ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందాయి. అయినా వీటికి ఏ కేటగిరీలో అవార్డు రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు రావడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తమ శక్తికి మించి నటించారు. జై భీమ్ లోని హీరో మణికందన్ గిరిజన యువకుడిగా పాత్రలో లీనమై పోయారు. వీరు కనీసం పోటీలో ఉన్నారన్న విషయం వినిపించలేదు. ఇలాంటి వారు అవార్డులకు పోటీ పడరా? అని సోషల్ మీడియాలో ఆసక్తి చర్చ సాగుతోంది. ఇక ఉత్తమ నటిగా ఆలియా భట్ (గంగుబాయి కాటియావాడి), కృతి సనన్ (మిమి)లను ఉత్తమ నటీమణులగా ఎంపిక చేశారు. అయితే జై భీమ్ లో హీరోయిన్ గా నటించిన లిజోమోల్ జోస్, గ్రేట్ ఇండియా కిచెన్ లో హీరోయిన్ గా నటించిన నిమిషా సాజయన్ ఇంకా బాగా నటించారు. వీరిని ఎంపిక చేస్తే బాగుండు అన్న ప్రచారం సాగుతోంది.
ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో సంజయ్ లీలా భన్సాలీ అవార్డును గెలచుకున్నాడు. కానీ ‘మానాడు’ అనే సినిమా ఎడిటింగ్ మరింత ఆకట్టుకుంటుందన్న ప్రచారం సాగుతోంది. సంగీతలో దేవి శ్రీ ప్రసాద్ కు అవార్డు రావడం ప్రశంసనీయం.ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిత్రాంభళం పాటు ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ఏదీ ఏమైనా జాతీయ అవార్డుల విషయంలో కొన్ని సినిమాలను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: National film awards 2023 why cant they be the best actors and actresses why didnt they get awards
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com