Allu Arjun-Johnny Master : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ‘నేషనల్ అవార్డు’ రావడం మన కలగా భావిస్తున్న మనం ఒకే సంవత్సరంలో ఇద్దరికీ ‘నేషనల్ అవార్డు’ రావడం ఇద్దరూ అరెస్ట్ అవ్వడం చూస్తుంటే ఇండస్ట్రీ లో ఇది జరుగుతుందనే విషయం అయితే అర్థం అవుతుంది. ఇక ఈ విభయం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. ఇక జానీ మాస్టర్ కి ‘నేషనల్ అవార్డు’ అనౌన్స్ చేసిన వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కారణం ఏంటి అంటే అతను తన అసిస్టెంట్ ని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆ అమ్మాయి కేసు పెట్టింది. దాంతో అతన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఇక ఎట్టకేలకు ఆయన జైలు నుంచి బయటకు అయితే వచ్చాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇది మరిచేలోపే అల్లు అర్జున్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నేషనల్ అవార్డు’ ని అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున ఆయన థియేటర్ దగ్గరికి రావడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే ఆవిడ మృతి చెందింది. ఇక ఇది చూపించి అల్లు అర్జున్ మీద కొన్ని కేసులను బనాయించి ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఆయన ఎన్ని రోజులపాటు జైల్లో ఉంటాడనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు…
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నేషనల్ అవార్డు వచ్చిన ఇద్దరు అరెస్ట్ అవ్వడం ఏంటి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు కలిసి రావడం లేదా అలా అని కాకుండా కొంతమంది కావాలనే నేషనల్ అవార్డు వచ్చిన వారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారా అనే ధోరణిలో ఇప్పుడు అందరి దృష్టి సాగుతుంది.
ఇక ఏది ఏమైనా కూడా నేషనల్ అవార్డు అందుకోవడం అనేది ఆషామాషి విషయమైతే కాదు. ఎందుకంటే ఒకసారి నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపైతే ఉంటుంది. మరి వీళ్ళు గుర్తింపు సాధించుకుంటే మిగతావాళ్లు వెనకబడిపోతారనే ఉద్దేశ్యంతో అలా చేశారా లేదా యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ విషయమైతే మింగుడు పడడం లేదు.
పుష్ప 2 సక్సెస్ అయిన సంతోషంలో వాళ్ళు ఉంటే అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడనే విషయం తెలిసేసరికి ఒక్కసారిగా వాళ్ళ ఆనందం ఆవిరైపోయిందనే చెప్పాలి…ఇక ఆయన ఎప్పుడు బయటికి వస్తాడనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…