Homeఎంటర్టైన్మెంట్Kishkindha Kaandam : మైండ్ బ్లాక్ చేసే మర్డర్ మిస్టరీ, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ...

Kishkindha Kaandam : మైండ్ బ్లాక్ చేసే మర్డర్ మిస్టరీ, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ నటించిన బెస్ట్ మూవీ ఓటీటీలో… డోంట్ మిస్!

Kishkindha Kaandam : సూరారైపోట్రు చిత్రంలోని నటనకు అపర్ణ బాలమురళి నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింద కాండ. మలయాళ భాషలో తెరకెక్కిన ఈ మలయాళ క్రైం థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. కేవలం రూ. 5 కోట్లతో నిర్మించగా .. రూ. 50 కోట్ల రాబట్టి భారీ లాభాలు పంచింది. సెప్టెంబర్ 12న కిష్కింద కాండ విడుదలైంది. కిష్కింద కాండ చిత్రానికి దిన్జీత్ అయ్యథన్ దర్శకత్వం వహించాడు.

కిష్కింద కాండ మూవీ కథ:

అపర్ణ(అపర్ణ బాలమురళి), అజయన్(ఆసిఫ్ అలీ) ప్రేమ వివాహం చేసుకుంటారు. కానీ అజయన్ కి అంతకు ముందే వివాహం అవుతుంది. భార్య క్యాన్సర్ తో చనిపోతుంది . వీరి కుమారుడు చాచు కనిపించకుండా పోతాడు. దాంతో డిప్రెషన్ కి గురవుతాడు. అపర్ణతో ప్రేమ తర్వాత కోలుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు.

అజయ్ తండ్రి అప్పు పిళ్ళై విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. అతడు ఇంట్లోనే ఉంటాడు. మతిమరుపు కారణంగా ప్రతి విషయం పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు. తప్పి పోయిన చాచు కోసం అపర్ణ, అజయన్ వెతుకుతూనే ఉంటారు. ఒకరోజు అప్పు పిళ్ళై గన్ మిస్ అవుతుంది. ఆ గన్ కారణంగా కొందరు ప్రాణాలు పోతాయి. అసలు గన్ దొంగిలించింది ఎవరు? చాచు ఏమైపోయాడు? మనిషి శవం స్థానంలో కోతి శవం ఎలా దొరికింది? అనేది మిగతా కథ..

కిష్కింద కాండ డిజిటల్ రైట్స్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తుంది. అక్టోబర్ 11 నుండి కిష్కింద కాండ స్ట్రీమ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

అడుగడుగునా ఉత్కంఠ రేపే మలుపులో మూవీ సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి కిష్కింద కాండ బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు. దసరాకు కుటుంబ సభ్యులతో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

RELATED ARTICLES

Most Popular