SS Thaman: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన అలా వైకుంఠపురం లో సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి పార్ట్ 1 రేంజ్ వసూళ్లను దక్కించుకొని ఇండస్ట్రీ హిట్ అయ్యింది..ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి మ్యూజిక్..ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ నేషనల్ లెవెల్ లో మారుమోగిపోయింది..’బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ’ పాట కి మన ఇండియన్ క్రికెటర్స్ కూడా డాన్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి..అలాంటి బ్లాక్ బస్టర్ ఆల్బం ని అందించి ప్రేక్షకులను మైమరపించి పొయ్యేలా చేసిన థమన్ కి ఈరోజు నేషనల్ అవార్డు దక్కింది..ప్రస్తుతం సౌత్ లో థమన్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన సంగీతం అందించిన ఆల్బమ్స్ అన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి..ముఖ్యంగా ఆయన అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలకే హైలైట్ గా మారిపోతున్నాయి.
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పాటలకు సంగీతం అందించిన థమన్ ని నేషనల్ అవార్డు రావడం తో టాలీవుడ్ మొత్తం ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది..మని శర్మ గారి దగ్గర ఎన్నో ఏళ్ళు కీ బోర్డు ప్లేయర్ గా పని చేసిన థమన్, ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ తన కిక్ సినిమా కి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ని నూటికి నూరుపాళ్ళు ఉపయోగించుకొని థమన్ సినిమాతోనే తన సత్తా ని చాటుకున్నాడు..ఇక ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన దూకుడు సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా తర్వాత థమన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
సినిమా సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు జాతీయ అవార్డు ని గెలుచుకునే రేంజ్ కి ఎదిగాడు..ప్రస్తుతం థమన్ చేతిలో అక్షరాలా 14 సినిమాలు ఉన్నాయి..సౌత్ ఇండియా లో ఈ రేంజ్ బిజీ గా ఉన్న ఏకైక సంగీత దర్శకుడు థమన్ మాత్రమే..రాబొయ్యే రోజుల్లో థమన్ ప్రభంజనం ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
Also Read:Sree Vishnu: ప్రముఖ హీరో శ్రీ విష్ణు కి తీవ్ర అస్వస్థత..ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు