https://oktelugu.com/

Naseeruddin Shah: ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాల్లో మేటర్ లేదు,చూడాలకేపోయా… సీనియర్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్

ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్, గదర్ 2 చిత్రాలను తప్పుబట్టారు. ప్రాపగాండా చిత్రాలుగా అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రాలు మతానికి, దేశానికి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రాలు.

Written By:
  • Shiva
  • , Updated On : September 27, 2023 5:49 pm
    Naseeruddin Shah

    Naseeruddin Shah

    Follow us on

    Naseeruddin Shah: ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాలను ఉద్దేశిస్తూ నటుడు నసీరుద్దీన్ షా ఊహించని కామెంట్స్ చేశారు. ఆ చిత్రాల్లో మేటర్ లేదు. చూడలేకపోయాను అన్నట్లు వెల్లడించారు. బాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరైన నసీరుద్దీన్ షాకి గొప్ప పేరుంది. ఆయన నటుడిగా అరుదైన గౌరవాలు అందుకున్నారు. మూడు సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి అత్యుత్తమ ప్రభుత్వ పురస్కారాలు సాధించారు. ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలను ఆయన వ్యతిరేకించారు.

    ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్, గదర్ 2 చిత్రాలను తప్పుబట్టారు. ప్రాపగాండా చిత్రాలుగా అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రాలు మతానికి, దేశానికి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రాలు. ఈ చిత్రాలను ఆయన తప్పుబట్టారంటే అర్థం అవుతుంది. పక్కా కమర్షియల్ చిత్రాలైన ఆర్ ఆర్ ఆర్, పుష్ప లను ఆయన తక్కువ చేసి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఆయన మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాలను నేను చూడలేకపోయాను. కాసేపు చూసాక విసుగొచ్చేసింది. ఆ చిత్రాల్లో థ్రిల్ చేసే అంశాలు తప్పితే ఏం లేదు. విపరీతమైన హీరోయిజం, కండలు చూపించడం తప్పితే గొప్ప ఏం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను మహిళలు ఇష్టపడతారని నేను అనుకోను.మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ నేను ఎంజాయ్ చేశాను. ఆ చిత్రం పూర్తిగా చూడగలిగాను.

    ఎందుకంటే మణిరత్నం గొప్ప ఫిల్మ్ మేకర్. ఎలాంటి ప్రోపగాండా లేకుండా సినిమా తెరకెక్కించారు, అన్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్ మంచి చిత్రాలు చేస్తున్నారన్న నసీరుద్దీన్ షా చిన్న సినిమాల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి. వాటికి సరైన గౌరవం దక్కాలని వెల్లడించారు. టాలీవుడ్ కి చెందిన రెండు సక్సెస్ఫుల్ చిత్రాలపై నసీరుద్దీన్ షా చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పుష్ప ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకోగా… ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే..