Nari Nari Naduma Murari OTT: ఈ సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలై, ఎవ్వరూ ఊహించనంత భారీ విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో మార్కెట్ ని పూర్తిగా కోల్పోయిన శర్వానంద్(Sharwanand) కి ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ సాధారణమైనది కాదు. నాలుగు సినిమాల పోటీని తట్టుకొని, థియేటర్స్ పెద్దగా దొర్కకపోయిన కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా ఆడుతూనే ఉంది. వీకెండ్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనపడుతున్నాయి. కానీ ముందుగా ఓటీటీ సంస్థ తో పెట్టుకున్న ఒప్పందం కారణంగా, ఈ చిత్రాన్ని ఓటీటీ లో నేడు అర్థ రాత్రి విడుదల చేయబోతున్నారు.
అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాని విడుదల తర్వాత మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేసిందట. దీంతో థియేటర్స్ లో నిర్మాతకు మంచి రన్ ఉన్నప్పటికీ కాదు అనలేక అమ్మేయాల్సి వచ్చిందట. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతే, గత ఏడాది విడుదలైన ‘అఖండ 2’ కి కూడా నిర్మాత. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. నిర్మాతకు, బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ కి నిర్మాత అనిల్ సుంకర ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాన్ని ఇచ్చాడు. దీంతో ‘అఖండ 2’ చేసిన నష్టాల నుండి బయ్యర్స్ చాలా వరకు రీకవర్ అయ్యారు, అనిల్ సుంకర కి కూడా డబ్బులు బాగా మిగిలాయి. ఇక పోతే నేడు అర్థ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ చిత్రం తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
థియేటర్స్ లో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించిన ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి. ‘సమజవరగమనా’ తో సూపర్ హిట్ ని అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బూరి, ఈ చిత్రం తో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం లో సీనియర్ హీరో నరేష్ కీలక పాత్ర పోషించాడు. ఆయన పాత్ర ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిల్చింది. ఇక క.మెడియన్స్ గా చేసిన వెన్నెల కిషోర్, సత్య లు మరోసారి ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించారు.