
సినిమా ఇండస్ట్రీలో ‘పారితోషికం’ అనే అంశంలో ఎంతటి స్టార్స్ అయినా తల వంచాల్సిందే. స్టార్ డమ్ ఆకాశంలో ఉన్నా.. క్యాష్ చేసుకోవడం రాకపోతే.. చివరకు నష్టపోయేది ఆ స్టారే. అందుకే.. ఎన్ని తెలివితేటలూ ఉన్నా.. ‘పారితోషికం’ విషయంలో మాత్రం ప్రతి హీరో ఒక పర్సనల్ మేనేజర్ ను పెట్టుకుంటాడు. మరి హీరోయిన్ల పరిస్థితి ఏమిటి ? లౌక్యం లేని భామలకు కెరీర్ ఉండేది తక్కువే. అందులో ‘పారితోషికం’ విషయంలో పట్టు లేకపోతే.. ఇక వాళ్లకు మిగిలేది అనుభవాలే.
అందుకే ప్రతి హీరోయిన్ ‘పారితోషికం’ అనగానే ఆలోచనలో పడుతుంది. ఎక్కువ ఇస్తాం అనగానే.. కొందరు భామలు హాట్ హాట్ షో లకి రెడీ అయిపోతారు. కొంతమంది అయితే సెమీ న్యూడ్ గా నటించేందుకు కూడా సై అన్న హీరోయిన్స్ ను మనం ఇప్పటికే చూశాం. అయినా సోషల్ మీడియా ఎకౌంట్స్ లో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసమే.. ఈ మధ్య కాలంలో గ్లామర్ భామల సోకులకు హద్దు అదుపు లేకుండా బికినీలు, టూ పీస్, టాప్ లెస్ అంటూ హాట్ హాట్ ఫోటోలను తెగ పోస్ట్ చేస్తున్నారు.
అలాంటది ‘పారితోషికం’ అనగానే ఇంకొక్క అడుగు ముందుకెందుకు వెయ్యరు. కానీ ఒక్క చిన్న హీరోయిన్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నగ్నంగా నటిస్తే ఎన్ని కోట్లయినా ఇస్తామని ఓ వెబ్ సిరీస్ కోసం ఆఫర్ ఇస్తే.. అలాంటివి నేను చేయనని చెప్పి ఆ సిరీస్ నుండి తప్పుకుంది. ఇంతకీ ఎసరు ఆ భామ అంటే.. బాలీవుడ్ భామ ‘నర్గిస్ ఫక్రి’.
ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు గానీ, సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి మాత్రం ఈ భామ గురించి చాల బాగా తెలుసు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ షోలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ ఉంటుంది. ఏది ఏమైనా కోట్ల రూపాయలను కూడా కాదు అనుకుని.. నీచానికి నేను దిగజారనని తేల్చి చెప్పింది నర్గిస్ ఫక్రి.