Naresh vs Ramya Raghupathi : నరేష్ మీద మూడో భార్య రమ్య రఘుపతి విమర్శల పరంపర కొనసాగుతోంది. రమ్య తన ఆరోపణల దాడి మరింత పెంచారు. వాస్తవం ఏమిటో తెలియదు కానీ… రమ్య రఘుపతి బయటపెడుతున్న విషయాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. నరేష్ ఎఫైర్స్, ప్లే బాయ్ బిహేవియర్ గురించి తల్లి విజయనిర్మలకు తెలుసని రమ్య రఘుపతి మరో అలిగేషన్ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన రమ్య రఘుపతి సరికొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చారు. నరేష్ పెద్ద ఉమనైజర్. ఆయనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ. చాలా సార్లు వేరే మహిళలతో దొరికిపోయాడు. పట్టుబడిన తర్వాత రెండు మూడు నెలలు మంచిగా ఉంటాడు. గొప్ప భర్తగా బిహేవ్ చేస్తాడు.

నరేష్ ఎఫైర్స్ గురించి విజయనిర్మల గారికి తెలుసు. ఎప్పటికైనా నరేష్ మారతాడని నాకు సర్ది చెప్పేవారు. కొన్నాళ్ళు ఓర్చుకోమని సముదాయించేవారు. విజయనిర్మల మరణించాక ఆయనకు చెప్పేవారు లేకుండా పోయారు. ఇంకా విచ్చల విడి బిహేవియర్ అలవాటు చేసుకున్నాడని రమ్య రఘుపతి వెల్లడించారు. ఆమె ఇంకా మాట్లాడుతూ… నరేష్ నా మీద విడాకుల పిటిషన్ వేశారు.అలాగే పలు అలిగేషన్స్ చేస్తూ కేసులు వేశారు. ఆరు నెలలు అవుతున్నా అవి నిరూపించలేకపోయాడు.
నేను డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్ మాత్రమే వేశాను. అలాగే సంప్రదింపుల ద్వారా మా మధ్య సయోధ్య కుదర్చాలని కోర్టుని కోరాను. మా మధ్య ఎన్ని వివాదాలున్నా నరేష్ ని కోరుకుంటుంది నా కొడుకు కోసమే. నేను ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అందులో నిజం లేదు. పవిత్ర లోకేష్ కేవలం డబ్బు కోసం నరేష్ కి దగ్గరైంది. నేను పోరాటం చేస్తాను. భార్యనని కూడా చూడకుండా నరేష్ నన్ను టీజ్ చేస్తున్నాడని, రమ్య తన ఆవేదన చెందారు.
ఇక తన సమస్యలతో కుటుంబ సభ్యులకు సంబంధం లేనట్లు రమ్య రఘుపతి పరోక్షంగా చెప్పారు. నరేష్ గురించి నేను పేరెంట్స్ కి చెప్పలేదు. ఆర్య సమాజంలో మా వివాహం జరిగింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా నేను ఒక్కదాన్నే ఎదుర్కుంటాను, అన్నారు. రమ్య రఘుపతి ఇన్ని ఆరోపణలు చేసినా నరేష్ నోరు మెదపలేదు. ఆయన మీడియా ముందు రాలేదు. ఈ క్రమంలో నరేష్ మనసులో ఏముందనే సందిగ్ధత కొనసాగుతుంది. కాగా 2022 డిసెంబర్ 29న నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేశారు.