Actor Naresh Ready For Third Marriage: నటుడు నరేష్ ముచ్చటగా మూడో వివాహానికి సిద్ధం అవుతున్నాడు. 62 ఏళ్ల వయసులో ఓ తోడు కోరుకుంటున్నారు. భార్యగా తనతో పలు చిత్రాలలో నటించిన పవిత్ర లోకేష్ ని ఆయన వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ లేడీ విజయనిర్మల కొడుకు నరేష్ చిత్ర పరిశ్రమలో పుట్టి పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నరేష్ 80-90లలో హీరోగా రాణించారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. నరేష్ మొదటి వివాహంగా రేఖ అనే మహిళను వివాహం చేసుకున్నారు.
అనంతరం ఆమెతో విడిపోయారు. రెండో వివాహం రమ్య రఘుపతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇటీవల రమ్య రఘుపతి చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. కొందరు వ్యక్తుల నుండి కోట్లు వసూలు చేసినట్లు ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నరేష్ ఓ వీడియో ద్వారా రమ్యకు తనకు గల రిలేషన్ బయటపెట్టారు. ఒకప్పుడు ఆమె నాకు భార్యగా ఉన్న విషయం నిజమే… మేము విడిపోయి 5-6 ఏళ్ళు అవుతుంది. రమ్యతో గాని, ఆమె ఆర్థిక నేరాలతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
Also Read: Samantha: నాగచైతన్యతో విడిపోయినా.. అతడి గుర్తులు మాత్రం వదలని సమంత.. వైరల్ ఫొటోలు
రమ్యతో విడిపోయినప్పటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ఆయన సన్నిహితంగా ఉంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. నరేష్ తన పలుకుబడి ఉపయోగించి ఆమెకు అవకాశాలు కూడా ఇప్పిస్తున్నారనే టాక్ ఉంది. తాజాగా వారిద్దరి వివాహం అంటూ వార్తలు వస్తున్నాయి. పవిత్ర లోకేష్ భర్త నుండి విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అందుకే నరేష్ తో వివాహానికి ఆమె సంశయిస్తున్నారు. ఎట్టకేలకు వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది అంటున్నారు.
నరేష్ కి రెండు వివాహాల ద్వారా ముగ్గురు అబ్బాయిల సంతానం ఉన్నట్లు సమాచారం. పెద్ద కుమారుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఐనా ఇష్టం నువ్వు, ఊరంతా అనుకుంటున్నారు వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ రెండు చిత్రాలు పరాజయం పొందాయి. నరేష్ మూడో వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Case Against Nayanthara: పెళ్ళై 24 గంటలు కాకుండానే నయనతారపై కేసు?.. నూతన దంపతులకు బిగ్ షాక్!
Recommended Videos:
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Naresh who is getting ready for his third marriage at the age of 62 is the star character artist
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com