Naresh- Pavitra Lokesh: సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ని పెళ్లాడబోతున్నట్టు వచ్చిన వార్తలు ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో ఎలాంటి ప్రకంపనలు పుట్టించాయో మన అందరికి తెలిసిందే..62 ఏళ్ళ వయస్సులో పెళ్లేంటి అంటూ నెటిజెన్స్ నరేష్ ని బండబూతులు తిట్టడం ప్రారంభించారు..దానికి తోడు నరేష్ మూడవ భార్య రమ్య చేసిన రచ్చ ని కూడా అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..నా కంఠం లో ప్రాణం ఉన్నంతవరకు నరేష్ కి విడాకులు ఇవ్వబోనని..నాకు ఆ దుర్మార్గుడు మోసం చేస్తున్నాడంటూ ఆమె మీడియా ముందు చేసిన ఆరోపణలు ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

నరేష్ – పవిత్ర బెంగళూరు లోని ఒక హోటల్ లో నివాసం ఉంటున్నారని తెలుసుకొని అక్కడకి వాళ్ళని మీడియా ముందు చెప్పు తో కొట్టడానికి వచ్చి ఆమె సృష్టించిన హంగామా అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశం ఈమధ్య కాలం లో నెటిజెన్స్ పట్టించుకోవడం మానేశారు.
అయితే ఈమధ్య కాలంలో మళ్ళీ ఈ జంట వార్తల్లోకి ఎక్కింది..అసలు విషయానికి వస్తే నరేష్ మరియు పవిత్రాలు విడిపోయారని..వీళ్లిద్దరి మధ్య ఇటీవల కాలం లో చోటు చేసుకున్న కొన్ని విభేదాల కారణం గా విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా ని ఊపేస్తోంది..వీళ్లిద్దరి డేటింగ్ వ్యవహారం యొక్క ప్రభావం పవిత్ర లోకేష్ సినీ కెరీర్ పై చాలా తీవ్రంగా పడిందట.

ఈ వ్యవహారం కి ముందు ఆమె చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉండేవి..ఇప్పుడు ఈ వ్యవహారం బయటపడడం తో ఈమెని తమ సినిమాల్లో పెట్టుకోడానికి నిర్మాతలు నిరాకరిస్తున్నారట..అలా ఒప్పుకున్న సినిమాలు చెయ్యి జారిపోయాయట..ఈ విషయం లోనే వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు ఫిలిం నగర్ వినిపిస్తున్న టాక్..ఈ వ్యవహారం బయటపెట్టడం వల్లే తన సినిమా కెరీర్ నాశనం అయిపోయిందని పవిత్ర లోకేష్ గారు రోజు బాధపడేవారట.
మరి సోషల్ మీడియా లో ఏ చిన్న రూమర్ వచ్చిన వెంటనే స్పందించి క్లియర్ చేసుకునే నరేష్ ఇప్పుడు ఈ విషయం గత కొద్దీ రోజులుగా ఈ రేంజ్ వైరల్ అవుతున్నా కూడా పట్టించుకోవడం లేదంటే కచ్చితంగా వీళ్లిద్దరు విడిపోయారనే అంటున్నారు నెటిజెన్స్.