Malli Pelli Movie Review: నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఫుల్ రివ్యూ

టాలీవుడ్ లో నెగటివ్ పబ్లిసిటీ ద్వారా బాగా ఫేమస్ అయిన జంట నరేష్ మరియు పవిత్ర లోకేష్. ముసలి వయస్సు లో నరేష్ కి ఇది నాల్గవ పెళ్లి , పవిత్ర లోకేష్ కి రెండవ పెళ్లి. వీళ్లిద్దరి మధ్య వయస్సు తేడా సుమారుగా 20 ఏళ్ళు ఉంటుంది.

Written By: Vicky, Updated On : May 26, 2023 1:20 pm

Malli Pelli Movie Review

Follow us on

Malli Pelli Movie Review: నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ, భద్రమ్ తదితరులు.
దర్శకుడు : ఎం.ఎస్.రాజు
నిర్మాత : నరేష్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి
ఎడిటింగ్ : జునైద్ సిద్ధిక్యూ

టాలీవుడ్ లో నెగటివ్ పబ్లిసిటీ ద్వారా బాగా ఫేమస్ అయిన జంట నరేష్ మరియు పవిత్ర లోకేష్. ముసలి వయస్సు లో నరేష్ కి ఇది నాల్గవ పెళ్లి , పవిత్ర లోకేష్ కి రెండవ పెళ్లి. వీళ్లిద్దరి మధ్య వయస్సు తేడా సుమారుగా 20 ఏళ్ళు ఉంటుంది. గత కొంతకాలం నుండి డేటింగ్ చేసుకుంటున్న ఈ ఇద్దరు, కుటుంబ సభ్యుల అంగీకారంతో రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిని మొదటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి, మీడియా ముందుకు వచ్చి చేసిన రచ్చ, బెంగళూరు హోటల్ రూమ్ లో నివాసం ఉంటున్న నరేష్ పవిత్ర రూమ్ కి వెళ్లి వాళ్ళని చెప్పుతో కొట్టడానికి చేసిన ప్రయత్నం, ఇవన్నీ సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు నరేష్ ఈ సంఘటనలన్నీ ఆధారంగా తీసుకొని చేసిన ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.

కథ :

నరేష్ పవిత్ర లోకేష్ ఎందుకు ఒకటి అవ్వాల్సి వచ్చింది, పవిత్ర లోకేష్ కి మొదటి భర్త నుండి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఎందుకు నరేష్ రమ్య ని వదిలేసాడు?, పవిత్ర ఎందుకు తన మొదటి భర్త ని వదిలేయాల్సి వచ్చింది. నరేష్ పవిత్రలు మధ్య స్నేహం ఎలా మొదలైంది, అలా స్నేహం ప్రేమ గా ఎలా మారింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం గా ఈ చిత్రాన్ని తీశారు. ఇవి నిజమో , కాదో మనకి అయితే తెలియదు కానీ, అసలు ఏమి జరిగింది అనే ఆత్రుత ఉన్నవారు మాత్రం పైన ఉన్న ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నరేష్ పవిత్ర మధ్య లవ్ సీన్స్ పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టాడు డైరెక్టర్ MS రాజు. ఇక ఈ సినిమాలో నరేష్ మూడవ భార్య రమ్య గా వనిత విజయ్ కుమార్ నటించింది. నా పాత్రని నెగటివ్ గా చూపించాలి అనుకుంటున్నారు అంటూ రమ్య రఘుపతి కోర్టు లో కేసు కూడా వేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిని విజయవంతంగా ఛేదించి నేడు ఈ చిత్రాన్ని విడుదల చేయించాడు నరేష్. సినిమా ఇంటర్వెల్ కి 30 నిమిషాల ముందు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. అయితే ఈ చిత్రాన్ని బాగా సాగదీసినట్టుగా అనిపించింది. కానీ బయోపిక్ కాబట్టి ఎక్కడ బోర్ లేకుండా అలా సాగిపోతుంది ఈ చిత్రం.

చివరి మాట :

నరేష్ పవిత్ర లవ్ స్టోరీ తెలుసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు. కొన్ని సన్నివేశాలు బాగా లాగ్ అనిపించాయి కానీ, ఓవరాల్ గా ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్ : 2.25/5