Narasimhanaidu Re-release : నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయిన చిత్రం ‘నరసింహ నాయుడు’. ఈ చిత్రం తాలూకు జ్ఞాపకాలను నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. మన టాలీవుడ్ కి మొట్టమొదటి 20 కోట్ల రూపాయిల షేర్ సినిమా ఇది. ఈ సినిమాతో పాటుగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మృగరాజు, మరియు విక్టరీ వెంకటేష్ దేవిపుత్రుడు సినిమాలు కూడా ఈ చిత్రం తో పోటీగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగాయి.
ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్స్ అవ్వగా, నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. చిరంజీవి మరియు బాలయ్య మధ్య అప్పట్లో నువ్వా నేనా అనే రేంజ్ పోటీ తత్త్వం ఉండేది. ఫ్యాన్స్ మధ్య కూడా ఫ్యాన్ వార్స్ ఒక రేంజ్ లో ఉండేవి. అలాంటిది చిరంజీవి సినిమా బాలయ్య సినిమా ముందు ఓడిపోవడాన్ని నందమూరి అభిమానులకు ఒక రేంజ్ హై ఇచ్చే మూమెంట్.
అలాంటి సంచలనాత్మక చిత్రాన్ని ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ నెల 10 వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఓపెన్ చేసిన షోస్ లో సింగిల్ స్క్రీన్ షోస్ హౌస్ ఫుల్ కి చాలా దగ్గరగా ఉన్నాయి.
కేవలం హైదరాబాద్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ దాదాపుగా పది లక్షల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి అయితే ఇది చాలా మంచి ట్రెండ్. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ రీ రిలీజ్ సింహాద్రి కి కూడా ఇదే రేంజ్ ట్రెండ్ ఉన్నింది. గ్రాస్ కూడా సింహాద్రి రేంజ్ లోనే వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Narasimhanaidu re release advance bookings adurs how much gross has been received so far
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com