నారప్ప ట్రైలర్ టాక్: వెంకటేశ్ ‘మాస్’ విశ్వరూపం

సరైన పాత్ర దొరకాలే కానీ టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేశ్ చెడుగుడు ఆడేస్తుంటాడు. ‘ఎఫ్2’లో కామెడీ చేసి నవ్వించినా.. ‘నారప్ప’లో ఊరమాస్ క్యారెక్టర్ లో కత్తి పట్టి నరికినా అందులో జీవించేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఫుల్ మాస్ మాసాల సాంగ్ లో మరోసారి విక్టరీ వెంకటేశ్ మనముందుకు వచ్చాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దీనికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా […]

Written By: NARESH, Updated On : July 14, 2021 12:43 pm
Follow us on

సరైన పాత్ర దొరకాలే కానీ టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేశ్ చెడుగుడు ఆడేస్తుంటాడు. ‘ఎఫ్2’లో కామెడీ చేసి నవ్వించినా.. ‘నారప్ప’లో ఊరమాస్ క్యారెక్టర్ లో కత్తి పట్టి నరికినా అందులో జీవించేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఫుల్ మాస్ మాసాల సాంగ్ లో మరోసారి విక్టరీ వెంకటేశ్ మనముందుకు వచ్చాడు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దీనికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ క్రమంలోనే బుధవారం ‘నారప్ప’ ట్రైలర్ ను విడుదల చేశారు. భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేశ్ నటన కట్టిపడేసేలా ఉంది. ఆయన చెప్పిన ‘చదువు’ పై డైలాగ్ అదిరిపోయేలా ఉంది.

తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘ఆసురన్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. కులవ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దాన్నిరిమేక్ చేసి తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి ‘నారప్ప’గా రూపొందించారు.

వెంకటేశ్ పక్కన ప్రియమణి హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, కార్తిక్ రత్నం కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. జులై 20న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నారు.