Nara Lokesh Mahanadu Speech: తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) ఆవిర్భావం సందర్భంగా కడప లో గత రెండు రోజుల నుండి మహానాడు(Mahanadu) కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చి ఈ మహానాడు కార్యక్రమాల్లో గత రెండు రోజుల నుండి పాల్గొంటున్నారు. వచ్చిన ప్రతీ అభిమానికి విందు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని సంతృప్తి పర్చడం లో నూటికి నూరం శాతం సక్సెస్ అయ్యింది తెలుగు దేశం పార్టీ. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తో పాటు ఇతర తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా కార్యకర్తలను ఉద్దేశించి అద్భుతమైన ప్రసంగాలను అందించారు. నేడు అనగా మూడవ రోజు కూడా మహానాడు కార్యక్రమం ఎంతో అద్భుతంగా సాగింది. మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలు కార్యకర్తలను ఎంతో ఉత్సాహ పరిచాయి.
గత ప్రభుత్వం లో మాజీ సీఎం జగన్ చేసిన అకృత్యాలు, టీడీపీ కార్యకర్తలపై వేసిన అక్రమ కేసుల గురించి నారా లోకేష్ ప్రస్తావించాడు. దాని గురించి ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు మన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. కానీ వాళ్లకి మనం ఏమని సమాధానం చెప్తూ వచ్చాం?, తగ్గేదేలే అని చెప్పుకుంటూ వచ్చాం’ అంటూ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మ్యానరిజం ని ఇమిటేట్ చేస్తూ లోకేష్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. అల్లు అర్జున్ తగ్గేదేలే మ్యానరిజం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద్డ వాళ్ళ వరకు ఎలా అలవాటుగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మన కల్చర్ లో తగ్గేదేలే మ్యానరిజం ఒక భాగం అయిపోయింది. నారా లోకేష్ సభలో ఎప్పుడైతే ఆ మ్యానరిజం చేసాడో, అప్పుడు సభ ప్రాంగణం మొత్తం కేరింతలతో దద్దరిల్లిపోయింది.
దీనిని బట్టీ అల్లు అర్జున్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటివి పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలకు జరుగుతూ ఉండేవి, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. ఈ వీడియో ని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ఈ చిత్రం మొదలు పెట్టుకోనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రం లో ఐదు మంది హీరోయిన్స్ నటించబోతున్నట్టు సమాచారం. వారిలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్,జాన్వీ కపూర్ ఇప్పటికే ఎంపికయ్యారు, మిగిలిన ఇద్దరి హీరోయిన్స్ కోసం గాలిస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన నారా లోకేష్ pic.twitter.com/UcDMR2RrB0
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2025