‘రాజా-రాణి’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైంది మలయాళ బ్యూటీ నజ్రియా. ఆ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ‘నజ్రియా నజీమ్’ నటనను, అలాగే ఆమె పలికించిన హావభావాలను అంత తేలిగ్గా ఎవ్వరూ మరచిపోలేరు. కేటీఆర్ లాంటి నాయకుడు కూడా ఈ తరంలో తనకిష్తమైన నటి ఎవరంటే.. నజ్రియానే అని పబ్లిక్ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారంటే కారణం.. నజ్రియా నటనా సామర్ధ్యాలే. అప్పట్లో ఆమె కళ్ళను ఆ కళ్లల్లో మెరిసిన ఎక్స్ ప్రెషన్స్ ను చూసి చాలామంది మనసు పారేసుకున్నారు.
అయితే ఆ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఎట్టకేలకూ తెలుగు ప్రేక్షకుల మనసులను రంజింపజేయడానికి నాని సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెడుతుంది. ”అంటే సుందరానికి’ అనే సినిమా నజ్రియాకు తెలుగులో డైరెక్ట్ మొదటి సినిమా. ఇప్పటికే నజ్రియా ఈ సినిమా సెట్స్ లో కూడా పాల్గొంది. అయితే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్, హీరో నానితో పోటీ పడి నటిస్తోంది. కొన్ని సీన్స్ లో అయితే, నాని లాంటి నేచురల్ స్టార్ ను కూడా పూర్తిగా డామినేట్ చేస్తోందట.
ఈ సినిమా కోసం ఇప్పటికే పది రోజులు పాటు షూటింగ్ చేసింది నజ్రియా. కాగా ఆమె సీన్స్ చాల బాగా వచ్చాయట. ముఖ్యంగా నానితో సాగే సీన్స్ లో అయితే ఆమె ముందు అసలు నాని పూర్తిగా తేలిపోయాడని, నజ్రియా తన కళ్ళతోనే అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేసిందని చిత్రయూనిట్ నుండి అందుతున్న సమాచారం. సహజంగా హీరోయిన్లను బాగా నటించమని ఎంకరేజ్ చేసే నాని, నజ్రియా విషయంలో మాత్రం అందుకు అపోజిట్ లో ప్రవర్తిస్తున్నాడట. మొత్తానికి నానిలో ఇప్పడు టెన్షన్ మొదలైంది.
తనది చాల న్యాచురల్ పెర్ఫామెన్స్ అనే.. నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు వచ్చింది. కానీ నజ్రియా నేచురల్ నటన ముందు ఈ నేచురల్ స్టార్ నటన చాల అసహజంగా ఉందట. అందుకే నాని, నజ్రియాకి నటన విషయంలో సలహాలు సూచనలు ఇవ్వకుండా, పైగా ఆమెకు తెలుగు రాదు కాబట్టి.. సీన్ పేపర్ లో ఆమెను కన్ ఫ్యూజ్ చేస్తూ.. ఎలాగోలా ఆమెను డామినేట్ చేయడానికి, కనీసం ఆమె తనను డామినేట్ చేయకుండా ఉండటానికి నాని నానాతిప్పలు పడుతున్నాడట, పాపం నాని.