Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు. అష్ట చమ్మ అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన నాని ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూ వరుస విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి అలాంటి సందర్భంలోనే నాని నుంచి వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అయితే లభిస్తోంది. ఇక మే ఒకటోవ తేదీన హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు. తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే వచ్చిన ‘హిట్ ‘, ‘హిట్ 2’ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. కాబట్టి ఈ సినిమాతో నాని స్టార్ హీరోగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్న నాని ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘హిట్ 3’ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు!
మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… నిజానికి నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో గానీ యూత్ లో గాని చాలా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.
మరి ఇప్పుడు కొత్తగా మాస్ సినిమాతో మాస్ ప్రేక్షకులను సైతం అలరించి బీ,సీ సెంటర్లో తను సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధించి టైర్ వన్ హీరోగా మారబోతున్నాడా తద్వారా ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరికి పోటీని ఇవ్వగలుగుతాడా? అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా నేచురల్ స్టార్ నాని చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తున్న క్రమంలో ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఈ సినిమా ఇలాంటి సక్సెస్ ని సాధించబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : అల్లు అర్జున్ బాటలోనే నాని నడుస్తున్నాడా..?