Nani The Paradise team: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ, నేడు టాలీవుడ్ లో స్టార్ హీరోల లీగ్ కి అతి చేరువలో ఉన్న హీరో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). ‘దసరా’,’హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. దసరా కి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నాని తన సొంత నిర్మాణ సంస్థ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 26 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నట్టు నాని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసాడు. అయితే స్క్రిప్ట్ డెవలప్మెంట్ కోసం కొన్ని రోజులు, సినీ కార్మికుల సమ్మె కారణంగా మరికొన్ని రోజులు షూటింగ్ ఆగిపోవడం తో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ మొతం డిస్టర్బ్ అయ్యాయి.
అందుకే ఇప్పుడు నిద్రాహారాలు మాని మరీ మూవీ టీం మొత్తం పని చేస్తుందట. ఎట్టిపరిస్థితిలోనూ మార్చ్ 26 నే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్ లో జరుగుతోంది అట. నాని పై గత కొన్ని రోజుల నుండి కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాని తో సహా మూవీ టీం మొత్తం రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపొతున్నారట. ఇలా నెల రోజుల వరకు షూటింగ్ ఉండొచ్చని అంటున్నారు. దీనిని చూసిన నాని ఫ్యాన్స్ పగోడికి కూడా రాకూడదు అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.
ఇందులో ఆయన నాని కి తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని కొంతమంది, విలన్ క్యారక్టర్ చేస్తున్నాడని మరి కొంతమంది కామెంట్స్ చేశారు. అది కాస్త పక్కన పెడితే ఈ సినిమా కోసం మోహన్ బాబు ప్రత్యేకంగా వ్యవమాలు చేసి ఫిట్నెస్ కూడా పెంచుకున్నాడట. చూడాలి మరి ఈ ఉయస్సులో మోహన్ బాబు కుర్ర హీరో తో పోటీ ఎలా నటిస్తాడు అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలైన పక్క రోజే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల కాబోతోంది. మరి స్టార్ హీరో సినిమాకు నాని ఎదురు వెళ్లగలడా లేదా అనేది చూడాలి.