The Paradise movie release date: గత ఏడాది సెప్టెంబర్ 25 ని పవన్ కళ్యాణ్ అభిమానులు అంత తేలికగా ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ రోజే ‘ఓజీ’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని నెలకొల్పింది. ఇప్పుడు అదే తేదీపై నేచురల్ స్టార్ నాని కన్నేశాడు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ ఏడాది మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఇంకా పర్ఫెక్షన్ కోసం మరో 60 రోజుల పాటు షూటింగ్ ని ప్లాన్ చేశాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.
అందుకే ఆ తేదీ నుండి ఈ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే రోజున ఓజీ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ షూటింగ్ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసమే అని అంటున్నారు. తీసిన సన్నివేశాలను మళ్లీ మళ్లీ తీసే సందర్భాలు చాలానే ఉన్నాయట. బడ్జెట్ కూడా హద్దులు దాటడం తో కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ సంస్థ తో విడుదల తేదీ పై చర్చ జరపడం , వాళ్ళు సెప్టెంబర్ లో ఎట్టి పరిస్థితిలోనూ రావాలని , ఆ నెల దాటితే డబ్బులు కట్ చేస్తామని చెప్పడంతో , సెప్టెంబర్ నెలలోపు పోస్ట్ ప్రొడక్షన్ తో సహా సినిమా పూర్తి అవ్వాలని నాని డెడ్ లైన్ పెట్టాడట.
కనీసం ఈ చిత్రం సెప్టెంబర్ 25 న అయినా వస్తుందా లేదో చూద్దాం. ఇకపోతే ఈ చిత్రం లో మోహన్ బాబు విలన్ గా నటిస్తుండగా , కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి , అదే విధంగా ‘ఆయా షేర్’ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం లో మరో ముఖ్యమైన విలన్ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు, దీనికి కూడా బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ వచ్చిన వైరల్ అయిపోతుంది , ఆడియన్స్ కి తెగ నచ్చేస్తోంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
