Nani The Paradise Netflix deal: నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఏ స్థాయిలో మన టాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘దసరా’ చిత్రం నుండి నాని కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమా సినిమాకు తన స్థాయి , మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో , ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. ‘దసరా’ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో నాని చేస్తున్న రెండవ చిత్రమిది. ఈమధ్యనే ఈ చిత్రం నుండి విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు ఏ రేంజ్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.
ఏ ఈవెంట్ కి వెళ్లినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ పట్ల చాలా జాప్యం జరుగుతోంది , ఇదే ఈ సినిమాపై హైప్ డైల్యూట్ అయ్యేలా చేస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ కుదర్లేదు. షూటింగ్ కార్యక్రమాలు చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఎట్టిపరిస్థితిలోనే ఆగస్టు 21 న ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా , షెడ్యూల్స్ ని డిజైన్ చేశారు. కానీ కుదర్లేదు , ఇప్పుడే ఇదే ఆగస్టు 21 న రవితేజ ‘ఇరుముడి’ చిత్రం విడుదల కాబోతుంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే , ఈ సినిమా ఆగస్టు నుండి డిసెంబర్ నెలకు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 60 రోజుల సమయం పడుతుందట, రీసెంట్ గానే ఆ లాంగ్ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ మొదలైంది.
షూటింగ్ ని పూర్తి చేసి , ఎలా అయినా డిసెంబర్ నెలకు రావాలని చూస్తున్నారు. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు వాయిదా పడడంతో, మేకర్స్ పై ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో ఎలా అయినా విడుదల చేసేలా ప్లాన్ చేయమని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చాయట, అందుకే సెప్టెంబర్ లో విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటే , ముందుగా మాట్లాడుకున్న రేట్ కంటే డబుల్ ఇస్తామని నెట్ ఫ్లిక్స్ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తోంది. ‘ప్యారడైజ్’ టీం కూడా సెప్టెంబర్ లో ఎలా అయినా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట , మరి అప్పటి లోపు షూటింగ్ అవుతుందో చూడాలి.

