https://oktelugu.com/

Hero Nani : శ్రీదేవి కూతురు జాన్వికపూర్‌పై మనసులో మాట బయటపెట్టిన హీరో నాని.. వైరల్ కామెంట్స్

నానీ నెక్స్ట్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌కి నాని చెక్ పెట్టినట్లే. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నానికి కొందరు ఈ ప్రశ్న వేశారు. దీనికి నాని స్పందిస్తూ.. నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అనేది కేవలం ఒక రూమర్ మాత్రమే.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2024 / 06:28 PM IST

    Hero Nani- janvi Kapoor

    Follow us on

    Hero Nani : అందాల తార దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తుంది. అయితే జాన్వీ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఇండస్ట్రీకి వచ్చిన ఆరేళ్ల తర్వాత జాన్వీ తెలుగు ప్రేక్షకులను ఆలరించనుంది. ఇటీవల దేవర నుంచి విడుదల అయిన చుట్టమల్లే సాంగ్‌ ఓ ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా విడుదల కాకముందే జాన్వీకి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దేవరతో తెలుగు తెరకు పరిచయం కానున్న జాన్వీ.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ సరసన కూడా నటించబోతుంది. అయితే తాజాగా మరో కుర్ర హీరోతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ హీరో.. వచ్చిన రూమర్స్ నిజమేనా? కాదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి.

    నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 29న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే నానీ నెక్స్ట్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌కి నాని చెక్ పెట్టినట్లే. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నానికి కొందరు ఈ ప్రశ్న వేశారు. దీనికి నాని స్పందిస్తూ.. నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. బహుశా ఆమెను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఏమో. దీని కోసం చర్చలు కూడా జరుగుతూ ఉండవచ్చు. ఆ సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి నేను ఈ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల వివరాలు తెలుసుకోలేకపోతున్నానని తెలిపారు. తదుపరి సినిమా గురించి ఇంకా కొన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నాని మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలిపారు.

    జాన్వీ కపూర్, ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 విడుదల కానుంది. తెలుగులో జాన్వీ మొదటి సినిమా దేవర. ఆ తర్వాత చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో నటిస్తోంది. ఈ రూమర్ కూడా నిజం అయితే జాన్వీకి ఇది మూడో సినిమా అవుతుంది. దేవర సినిమా విడుదల కాకుండానే జాన్వీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. చుట్టమల్లే సాంగ్‌తో జాన్వీకి అందరూ ఫిదా అయిపోయారు. కొంతమంది అయితే శ్రీదేవిని చూసినట్టు ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు. రిలీజ్ కాకుండానే జాన్వీ క్రేజ్ ఇలా ఉంటే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో అని నెటిజన్లు అంటున్నారు. మరి సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మూవీ విడుదల అయ్యేవరకు వేచి ఉండాల్సిందే.