Nani The Paradise: న్యాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నాని…అష్టాచమ్మా సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి చేరిపోయాడు…దసర సినిమాతో మాస్ హీరో అవతారం ఎత్తిన ఆయన ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మరోసారి అదే రీతిలో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కి మంచి ఆదరణ దక్కుతోంది. అలాగే నాని లుక్కుకు సైతం ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది… ప్రస్తుతం నాని ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, ఇంకొకటి కొడుకు పాత్ర కావడం విశేషం…ఈ రెండు పాత్రల్లోనూ నాని డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే ఈ సినిమాని చాలా వైల్డ్ గా తీయాలనే ఉద్దేశంతో బోల్డ్ కంటెంట్ ని సైతం ఇందులో కలిపి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలంటే మాత్రం మంచి సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి నాని రేంజ్ ను టచ్ చేస్తూ అలాగే దసర కు మించిన సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ పాత్రను పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. తను కూడా రెండు గెటప్పుల్లో మనకు కనిపించబోతున్నాడు.
అందులో ఒకటి ముసలి పాత్ర కాగా, మరొకటి యంగ్ ఏజ్ లో ఉన్న మోహన్ బాబు కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆయనకు సంబంధించిన రెండు లుక్కులను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు… మొత్తానికైతే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…