The Paradise: న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నాని…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను సంపాదించి పెట్టాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ‘దసర’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం నాని మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇప్పటి వరకు చేసిన సినిమాలు సాఫ్ట్ గా ఉన్నప్పటికి దసర సినిమాతో మాస్ అవతారం ఎత్తాడు. కానీ ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమా మాత్రం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ని మనం చూస్తే అందులో ఒక బూతు పదంతో ఆయన చేతి మీద టాటూ ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాని ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అనే రేంజ్ లో అతని మీద కొన్ని కామెంట్లైతే వచ్చాయి.
కానీ మొత్తానికైతే నాని ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాననే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. కానీ ప్రస్తుతం అతను ఈ సినిమా మీద కొంత వరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తను అనుకున్నట్టుగా ఈ మూవీ రావడం లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. తాను ఏ విధంగా ఊహించాడు. శ్రీకాంత్ ఓదెల తన విజన్ తో ఈ సినిమాని ఎలా చిత్రీకరిస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే తన తదుపరి చిరంజీవితో చేయబోతున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ దొరికినట్టు అవుతోంది. లేకపోతే మాత్రం చిరంజీవి ఆ సినిమాను పక్కన పెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో శ్రీకాంత్ సక్సెస్ ను సాధించి తద్వారా చిరంజీవి సినిమాని నెక్స్ట్ లెవల్లో నిలుపుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…