Animal: ఒక సినిమా దానిమీద అంచనాలు భారీగా ఉంటాయి ఇక ఇలాంటి సినిమా రిలీజ్ చేస్తున్న సమయంలో దాని దరిదాపుల్లో కొన్ని చిన్న సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియా సినిమాగా వస్తున్న అనిమల్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే డిస్కషన్ జరుగుతుంది.
రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో రన్బీర్ కపూర్ తనదైన రీతిలో నటిస్తూ సినిమా మీద అంచనాలు పెంచాడు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది అనే చెప్పాలి.ఇక అలాంటి నేపథ్యంలో డిసెంబర్ ఒకటోవ తేదీన ఈ సినిమా వస్తుంటే డిసెంబర్ 6,7 తేదీల్లో నాని హీరో గా చేస్తున్న హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు. నితిన్ హీరోగా వస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే ట్రేడ్ పండితులు సైతం ఈ రెండు సినిమాలు అనిమల్ కి పోటీగా ఎందుకు దింపుతున్నారు అని వాళ్లు కూడా ఒక నాని నితిన్ మీద కోపానికి వస్తున్నారు….
ఇక ఇలాంటి క్రమంలో ఈ రెండు సినిమాలకు ఎంతైనా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఎందుకంటే అనిమల్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్టయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా ఈ సినిమాల కి చాలా వరకు మైనస్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.ఇక ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ లు ఇంకా కొద్ది రోజులు వాయిదా వేసుకుంటే బాగుండేదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే అనిమల్ సినిమా మీద ఇప్పటికీ ప్రతి ప్రేక్షకుడు భారీ అంచనాలను పెట్టుకొని ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఇది వరుసగా మూడోవ విజయంగా నిలుస్తుందనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను రన్బిర్ కపూర్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎందుకంటే ట్రైలర్ లో చూస్తేనే తన యాక్టింగ్ లో విశ్వరూపాన్ని చూపించిన రాన్బిర్ కపూర్ సినిమాలో ఏ మేరకు మ్యాజిక్ చేసి ఉంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…