Nani Mass Hero Transformation: అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారిన నాని మొదట్లో తన నటనతో ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక తర్వాత మన పక్కింటి కుర్రాడులా ఉన్నాడు అని అందరి చేత అనిపించుకొని నాచురల్ స్టార్ గా అవతరించాడు. ఆ తర్వాత వరుసగా లవ్ స్టోరీస్ కామెడీ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగాడు. కానీ ప్రస్తుతం నాని రేంజ్ మారిపోయింది. ఎప్పుడైతే దసర సినిమా చేశాడో అప్పటినుంచి ఆయన మాస్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో మరో మట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి క్రమంలోనే మాస్ హీరోగా అవతరించబోతున్నాడు. నాని ఒకప్పుడు క్లాస్ ప్రేక్షకులను అలరించాడు.
Also Read: యంగ్ హీరోల కొత్త మెకోవర్ వెనక ఉన్న అసలు కారణం ఇదేనా..?
ఇక ఇప్పటికి ఆయన్నుంచి ఒక ఫ్యామిలీ సినిమా వస్తే చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి నాని ప్లేస్ ని భర్తీ చేయగల హీరో ఎవరున్నారు అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం క్లాస్ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకొని మన పక్కింటి కుర్రాళ్ళ లా ఉన్నారు అనిపించే నటులు ఎవరు కనిపించడం లేదు.
ఇప్పుడు రాబోతున్న హీరోల్లో ఎవరో ఒకరు నాని ప్లేస్ ని రీప్లేస్ చేయాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే ఒక వర్గం ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వచ్చి సినిమాలను చూడడమే మానేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం లేదు… ఇక నాని మాత్రం మళ్లీ క్లాస్ సినిమాల వైపు అడుగులు వేసే అవకాశం కనిపించడం లేదు. వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ప్రస్తుతం చేస్తున్న ప్యారడైజ్ సూపర్ సక్సెస్ ను సాధించి మాస్ హీరోగా ముందుకు సాగితే మాత్రం నాని టైర్ వన్ హీరోగా మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…