Ante Sundaraniki Review: అంటే సుందరానికీ మూవీ రివ్యూ

Ante Sundaraniki Review: నటీనటులు: నాని, నజ్రియా, నరేష్, రోహిణి, నదియా తదితరులు దర్శకత్వం : వివేక్ ఆత్రేయ నిర్మాత : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫర్ : నికేత్ బొమ్మి స్క్రీన్ ప్లే : వివేక్ ఆత్రేయ ఎడిటర్ : రవితేజ గిరిజాల శ్యామ్ సింగరాయ్ మూవీలో సోషలిస్ట్ గా ఓ సీరియస్ రోల్ చేసిన నాని, అంటే సుందరానికీ చిత్రంతో కామెడీ పంచడానికి సిద్దమయ్యాడు. దర్శకుడు వివేక్ […]

Written By: Shiva, Updated On : June 10, 2022 9:08 pm

Ante Sundaraniki Review

Follow us on

Ante Sundaraniki Review: నటీనటులు: నాని, నజ్రియా, నరేష్, రోహిణి, నదియా తదితరులు
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
నిర్మాత : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : నికేత్ బొమ్మి
స్క్రీన్ ప్లే : వివేక్ ఆత్రేయ
ఎడిటర్ : రవితేజ గిరిజాల

Nani and Nazriya

శ్యామ్ సింగరాయ్ మూవీలో సోషలిస్ట్ గా ఓ సీరియస్ రోల్ చేసిన నాని, అంటే సుందరానికీ చిత్రంతో కామెడీ పంచడానికి సిద్దమయ్యాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటించగా… మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అంటే సుందరానికీ మూవీ ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి అంచనాల మధ్య విడుదలైన అంటే సుందరానికీ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

Also Read: ‘NBK 107’ Teaser: బాలయ్య నరకడం మొదలుపెడితే ఇలాగుంటది!

కథ
సుందరం (నాని)సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. దీంతో చిన్నప్పటి నుండే ఆచారాల పేరుతో ఆంక్షలు, కట్టుబాట్ల మధ్య పెరుగుతాడు. ఈ కారణంగా స్వేచ్ఛా జీవితం కోల్పోతాడు. ఈ సుందరానికి అమెరికా వెళ్లాలనేది మా చెడ్డ కోరిక. దీనికి కూడా తండ్రి అడ్డుపడుతుంటాడు, సముద్రం దాటడటమే మహాపాపంగా ఆయన భావిస్తారు. నిస్సారంగా సాగుతున్న సుందరం జీవితంలోకి లీలా (నజ్రియా) ప్రవేశిస్తుంది. క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన లీలా థామస్ తో సుందరం పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. సుందరం, లీలా మతాలు వేరు, ఆచారాలు వేరు. ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే ఈ రెండు కుటుంబాలు… అసలు ప్రేమ, పెళ్లి అంటే ఎలా ఒప్పుకుంటారు? సుందరం అమెరికా కోరిక ఎలా నెరవేరింది? ప్రేమించిన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లాడా? అసలు లీలా-సుందరంల ప్రేమ కథకు ముగింపు ఏంటి ?ఇదే అంటే సుందరానికీ మూవీ అసలు కథ…

విశ్లేషణ

ఇరు మతాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, పేరెంట్స్ అడ్డుపడడం, వాళ్ళను ఎదిరించి ప్రేమ జంట అష్టకష్టాలు పడడం, చివరికి ప్రేమను గెలిపించుకోవడం లేదా మరణించడం… ఈ జోనర్ లో తెలుగులో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి లాంటి ఆల్ టైం క్లాసిక్స్ కూడా ఉన్నాయి. అంటే సుందరానికీ కథ చాలా పాతది. అయితే దానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ భిన్నమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫ్యామిలీ డ్రామా సృష్టించి ఆద్యంతం నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. తన అద్భుతమైన రైటింగ్ తో ప్రేక్షకులకు అనుభూతిని పంచారు. హీరో నాని, హీరోయిన్ నజ్రియా లతో పాటు నరేష్, రోహిణి, నదియా క్యారెక్టరైజేషన్స్ ఆత్రేయ గొప్పగా తీర్చిదిద్దారు.

Nani and Nazriya

బలమైన పాత్రలకు వివేక్ ఎంచుకున్న క్యాస్టింగ్ కూడా హెల్ప్ అయ్యింది. నజ్రియాను ఆయన ప్రత్యేకంగా ఎందుకు ఎంపిక చేశారో సినిమా చూశాక అర్థం అవుతుంది. కథలోని అన్ని పాత్రలు చాలా సహజంగా అనిపిస్తాయి. నటిస్తున్నారన్న భావన ప్రేక్షకుడికి కలగదు. బ్రోచేవారెవరురా మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వివేక్.. ఆ చిత్రానికి ఇచ్చిన ట్రీట్మెంట్, టేకింగ్ కొత్తగా ఉంటుంది. అదే స్టైల్ అంటే సుందరానికీ ఫాలో అయ్యాడు. వివేక్ ఆత్రేయ స్టైల్ మనం ఇతర దర్శకుల దగ్గర చూడం. సంగీత దర్శకుడిని కథలో భాగం చేసి… ప్రతి చిన్న డిటైలింగ్ వద్ద కూడా చిన్న చిన్న బిట్ సాంగ్స్ తో బీజీఎం ఇవ్వడం, కొత్త ప్రయోగం. ఇది నిజంగా ఆడియన్స్ ని మెప్పించింది.

నాని, నజ్రియా పోటీపడి నటించారు. ముఖ్యంగా నాని బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు.భిన్నమైన యాక్సెంట్, డైలాగ్ డెలివరీతో మెప్పించారు. సెకండ్ హాఫ్, పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి.

అంటే సుందరానికీ ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కథలో నవ్యత లేదన్న భావన కలుగుతుంది. అందరికీ తెలిసిన కథే కదా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రానికి మరో మైనస్. నెమ్మదిగా నడిచే కథనం బోర్ కొట్టిస్తుంది. కథలోకి ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అలాగే ఎటువంటి మలుపు లేకుండా సాగే కథనం వలన నెక్స్ట్ ఏమిటో ప్రేక్షకుడికి తేలిపోతుంది. మూడు గంటల నిడివి ఈ చిత్రానికి అవసరం లేదేమో అనిపిస్తుంది. మెరుగైన ఎడిటింగ్ తో కొంత నిడివి తగ్గిస్తే బాగుండన్న భావన కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్

నటీనటుల నటన
కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు
వివేక్ సాగర్ మ్యూజిక్
సెకండాఫ్, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
నిడివి

సినిమా చూడాలా? వద్దా?

అంటే సుందరానికీ ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలరించే కామెడీ, డ్రామా, రొమాంటిక్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథ రొటీన్ అయినప్పటికీ బలమైన క్యారెక్టరైజేషన్స్, నటుల ప్రతిభ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కొంచెం బోర్ కొట్టించే ఫస్ట్ హాఫ్, సినిమా నిడివి నిరాశపరిచే అంశాలు. నాని కొత్తగా ట్రై చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఈ వీకెండ్ కి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

oktelugu.com రేటింగ్ 2.75/5

Also Read:Nayanthara Wedding: నయనతార పెళ్లి వీడియో స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ కు ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా?

Recommended Videos:


Tags