https://oktelugu.com/

Kalyan Ram – Bimbisara Trailer Talk: ‘బింబిసార’ ట్రైలర్ టాక్ : కళ్యాణ్ రామ్ నెత్తుటి విన్యాసాలు.. విజువల్స్ కేక

Kalyan Ram – Bimbisara Trailer Talk: ‘త్రిగ‌డ్త‌ల రాజ్య‌పు నెత్తుటి సంత‌కం – బింబిసారుడి ఏక ఛాత్రాధిప‌త్యం’ అంటూ నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ‘బింబిసార’ సినిమా రాబోతుంది. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న’ అన్న వాయిస్ రాగానే.. ‘మహా చక్రవర్తి బింబిసార ఏలిన రాజ్యానికి’ అన్న డైలాగ్ మీద ట్రైలర్ విజువల్స్ స్టార్ట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 4, 2022 / 07:27 PM IST
    Follow us on

    Kalyan Ram – Bimbisara Trailer Talk: ‘త్రిగ‌డ్త‌ల రాజ్య‌పు నెత్తుటి సంత‌కం – బింబిసారుడి ఏక ఛాత్రాధిప‌త్యం’ అంటూ నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ‘బింబిసార’ సినిమా రాబోతుంది. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న’ అన్న వాయిస్ రాగానే.. ‘మహా చక్రవర్తి బింబిసార ఏలిన రాజ్యానికి’ అన్న డైలాగ్ మీద ట్రైలర్ విజువల్స్ స్టార్ట్ అయ్యాయి.

    nandamuri kalyan ram

    ‘రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం’ అంటూ.. అసలు బింబిసారుడు అంటేనే మరణశాసనం అనేలా సాగింది ఈ ట్రైలర్. ‘బింబిసార’ లుక్ లో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ట్రైలర్ లో కూడా హీరోని బాగా ఎలివేట్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్ మరియు ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి.

    Also Read: Pushpa 2: ‘పుష్ప 2’లో మరో స్టార్ హీరో.. బన్నీగా పోటీగా దించిన సుకుమార్

    ”ఓ స‌మూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖ‌డ్గం శాశిస్తే.. కొన్ని వంద‌ల రాజ్యాలు ఆ ఖ‌డ్గానికి త‌ల‌వొంచి బానిస‌లైతే.. అదే ‘బింబిసారుడి విజయం. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి ఆ బింబిసారుడి మళ్లీ పుడితే.. అనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

    nandamuri kalyan ram

    పొగ‌రుతో ఓ రాజ్యం మీసం మెలేసినట్టు.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తన మీసం మెలేశాడు. మొత్తానికి ఈ ట్రైలర్ అయితే కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం అన్నట్టు సాగింది. ముఖ్యంగా క‌ల్యాణ్ రామ్ క‌త్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. ఆయన కెరీర్ లోనే బెస్ట్ విజువల్స్. నందమూరి అభిమానులకు ఈ విన్యాసాలు ఫుల్ కిక్ ను ఇస్తాయి.

    ఏది ఏమైనా విజ‌య‌మో, వైఫ‌ల్య‌మో – ఏదీ ప‌ట్టించుకోకుండా ప్ర‌యోగాల చేస్తూనే వెళ్తుంటాడు క‌ల్యాణ్ రామ్‌. కొత్త క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌డం అంటే త‌న‌కు భ‌లే స‌ర‌దా. బింబిసార‌ కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. మరి చివరకు బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ ఏం చేస్తాడో చూడాలి.

     

    Tags