Nandamuri Kalyan Chakravarthy: సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఎన్నో కష్టాలు పడి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ప్రతి పాత్రలో ఒదిగిపోయి నటించిన నటులు మాత్రమే ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీని అంటిపెట్టుకొని ఉంటారు. అలాంటి క్రమం లోనే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నప్పటికి 80వ దశకంలో పలు సినిమాల్లో నటించి గొప్ప గుర్తింపును తెచ్చుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి… ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతను మొఖానికి మేకప్ వేసుకొని దాదాపు 35 సంవత్సరాలవుతుంది. కారణం ఏంటంటే తను సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ లో తన సోదరుడు హరీష్ చక్రవర్తి అలాగే తన కొడుకు పృథ్వి మృతి చెందారు.
ఇక అదే యాక్సిడెంట్ లో తన తండ్రి అయిన త్రివిక్రమ రావుకి చాలా గాయాలవ్వడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన తండ్రి బాగోగులు చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. దాంతో పాటుగా కొన్ని బిజినెస్ పనులను కూడా చూసుకుంటున్నాడు… ఇక ఇంతకీ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎవరంటే..? సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమరావు కొడుకు…
కళ్యాణ్ చక్రవర్తి బాలయ్యకి తమ్ముడవుతాడు…కళ్యాణ్ చక్రవర్తి ఇంటి దొంగ, తలంబ్రాలు, మేనమామ, అక్షింతలు లాంటి సినిమాల్లో నటించాడు. ఇక చిరంజీవి తో చేసిన లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి చెల్లెలు భర్తగా నటించడం విశేషం…ఇక ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఆయన ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇస్తుండటం తో నందమూరి అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఇక స్వప్న మూవీస్ ఎక్కుతున్న ఛాంపియన్ సినిమా కోసం అతని తీసుకురావడానికి ప్రొడ్యూసర్ స్వప్న చాలావరకు కష్టపడినట్టుగా తెలుస్తోంది…
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలోనే అతని చేత నటింప చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా ఛాంపియన్ సినిమాలో తన పాత్రకి గొప్ప గుర్తింపు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ నందమూరి నటుడు రీఎంట్రీలో ప్రేక్షకులందరి మన్ననలను పొందుతాడా? మరోసారి బిజీ అవుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…