Jr. NTR- Nandamuri Family: వెండితెర వేల్పుగా వెలిగిన ఎన్టీఆర్ వారసుల్లో సక్సెస్ అయ్యింది ఇద్దరే. కొడుకు బాలయ్య , మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ డమ్ కి ఆమడదూరంలో ఉండిపోయారు. ఎన్టీఆర్ కి ఎనిమిది మంది కుమారులు కాగా వారిలో హరికృష్ణ , బాలకృష్ణ నటులుగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ బాలకృష్ణ స్టార్ అయ్యాడు. నందమూరి ఫ్యామిలీలో మరో స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ అవతరించాడు.

టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 20 ఏళ్లకే స్టార్ అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది వంటి బ్లాక్ బస్టర్స్ పడే నాటికి నూనూగు మీసాల ప్రాయంలో ఉన్నాడు. ఎన్టీఆర్ స్పీడు చూసి వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడని నందమూరి కుటుంబం భయపడింది. ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి అభిమానుల ఫోకస్ జూనియర్ పై తగ్గించాలంటే మరో వారసుడ్ని దించాలని ప్లాన్ చేశారు. ఆ ఆలోచనలో నుండి పుట్టుకొచ్చిన హీరోనే తారకరత్న.
బాలకృష్ణ ఆధ్వర్యంలో తారకరత్నను నందమూరి ఫ్యామిలీ భారీగా లాంచ్ చేశారు. ఒకేసారి 9 సినిమాలకు తారక రత్న సైన్ చేశాడు. ఒకటో నెంబర్ కుర్రాడు అంటూ 2002లో తారకరత్న బరిలో దిగాడు. మూవీ పర్లేదు అనిపించినా కీరవాణి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఒకటో నెంబర్ కుర్రాడు హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ కి ధీటుగా తారకరత్న ఎదుగుతాడని భావించారు. అయితే వాళ్ళ ఆశలు అడియాశలయ్యాయి. తారకరత్న సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.

తారకరత్న లుక్స్ కూడా విమర్శల పాలయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్ సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి మరో మెట్టు ఎదిగాడు. మాస్ హీరోల లిస్ట్ లో చేరి స్టార్ గా అవతరించాడు. తారకరత్న ఫెయిల్ కావడంతో ఎన్టీఆర్ ని తొక్కేయాలన్న నందమూరి ఫ్యామిలీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే వంశానికి చెందిన ఎన్టీఆర్ ని దెబ్బతీయాలని వారు ఎందుకు అనుకుంటారనే సందేహం కలగవచ్చు. వాళ్ళు ఆయన్ని తమలో ఒకడిగా భావించరు. ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందినవారు. హరికృష్ణకు ఆమె రెండో భార్య. ఆమెకు పుట్టిన ఎన్టీఆర్ అంటే వాళ్లకు నచ్చదు.
స్టార్ అయ్యాక కూడా ఎన్టీఆర్ ని బాలయ్య ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమా వేయొద్దని థియేటర్ ఓనర్స్ ని భయపెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే టాలెంట్ కి కెరీర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఎన్టీఆర్ ని ఆపడం వాళ్ళ వల్ల కాలేదు. ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడ్డాక వటవృక్షమై కూర్చున్నాడు. రాజకీయంగా కూడా బాలయ్య వర్గానికి సవాల్ విసురుతున్నాడు. టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుకు, బాలయ్యకు చుక్కలు చూపిస్తున్నారు.