Nandamuri Chaitanya Krishna: ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన తెలుగు భాషను ఎందుకు అంటారు అంటే… అందులో ఉన్న సొగసు అటువంటిది. ఆ భాష కున్న గొప్పదనం అటువంటిది. ఆ భాషకు ఉన్న పరిమళం అటువంటిది. అందుకే తేట తేట తెలుగుల అనే పాట పుట్టింది. దేశ భాషలందు తెలుగులో నానుడి కూడా పురుడు పోసుకుంది.. ఆంగ్లము సకిలించుచు.. తెలుగు నేర్వవెందుకురా అని కాలోజీ అన్నా.. తెలుగంటే నిలువెత్తు నుడికారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నా.. అది తెలుగు భాషపై వారికున్న అభిమానం. కానీ అటువంటి తెలుగు భాష ఫరిడ వెళుతున్న రాష్ట్రంలో పుట్టిన తెలుగుదేశంలో ఉన్న నాయకులకు మాత్రం ఆ భాష మీద పట్టు లేదు. నేర్చుకోవాలనే కోరిక లేదు. చివరికి ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు మనవళ్ళ ల్లో ఒకరైన నందమూరి చైతన్య కృష్ణకు ఆయింత కూడా లేదు.
సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఒక వేదికలో నందమూరి చైతన్య కృష్ణ ఆవేశంగా మాట్లాడుతున్నారు. బహుశా అది చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి శ్రేణులు నిర్వహించిన సమావేశం అయి ఉంటుంది. అలాంటి సమావేశంలో చైతన్య కృష్ణ మాట్లాడిన మాటలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. కనీసం ఏం మాట్లాడాలో, మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకపోతే మనం మాత్రం ఏం చేయగలం? చూస్తూ జాలి పడటం తప్ప.. ఎక్కడో మూలన కూర్చుని ఉన్న స్త్రీలను చంద్రబాబు నాయుడు పైకి తీసుకు వచ్చాడట? డ్వాక్రా సంఘాలు పెట్టి వారికి వంట చేయించడం నేర్పాడట. చంద్రబాబు నాయుడు వల్లే మహిళలు బయటకు వస్తున్నారట.. ఇలాంటి వారి మాటల వినేందుకు జనం అక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి మాటలు ద్వారా జనానికి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే కదా కళ్యాణ్ రామ్ నీలో ఎన్టీఆర్ మాత్రమే ఒకటి అని చెప్పింది. అయినప్పటికీ వీరికి అర్థం కాదా?
చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసినప్పుడు.. ఒకవేళ ఆయనను అక్రమంగా జైల్లో పెట్టారు అని వీరికి అనిపించినప్పుడు.. చేయాల్సింది ఏంటి? కానీ వారు అప్పట్లో చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేస్తే బొచ్చు కూడా పీకలేరు అని అనడం దేనికి సంకేతం? అంటే గతంలో జగన్ ను అరెస్టు చేసినప్పుడు కూడా బొచ్చు కూడా పీకలేకపోయారా? ఏం మాట్లాడుతున్నారో అసలు? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు భాష మీద ఎలాంటి పట్టు కలిగి ఉండేవారు.. ఆయన మాటలకు ఎంతటి సమ్మోహన శక్తి ఉండేది.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఆయన అధికారులకు వచ్చారంటే దానికి కారణం అదే.. కానీ ఆయన కడుపున పుట్టిన కొడుకుల సంతానం మాత్రం ఇలా తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడలేకపోతోంది.. కనీసం ఆ మాట్లాడిన మాటలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోతోంది.. ఇలాంటివారా అధికారంలోకి వచ్చేది? ప్రజల సమస్యలను పరిష్కరించేది? ముందు తెలుగు నేర్చుకుంటే.. దాని అర్థం ఏమిటో తెలుసుకుంటే.. బాగుంటుంది.. ప్రజలకు ఇంకా బాగుంటుంది.. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడితేనే దక్కే అధికారం కూడా దూరం అవుతుంది.. అర్థమవుతుందా నందమూరి చైతన్య కృష్ణ?!
వైసీపీకి నందమూరి చైతన్యకృష్ణ మాస్ వార్నింగ్.. pic.twitter.com/eEsrg2SEVl
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 30, 2023