Nandamuri Chaitanya Krishna: బాబాయ్ డైలాగులను కూడా చెప్పలేకపోయిన నందమూరి చైతన్య కృష్ణ.. వైరల్ వీడియో

చైతన్య కృష్ణ ఎక్స్ ప్రెషన్స్, ఫైట్స్, నడక వంటి ప్రతి అంశం పైన ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ప్రస్తుతం సమర సింహారెడ్డి సినిమా డైలాగ్స్ ను తనదైన స్టైల్ లో చెప్పి వైరల్ అయ్యాడు ఈ హీరో.

Written By: Swathi, Updated On : February 28, 2024 1:44 pm
Follow us on

Nandamuri Chaitanya Krishna: ఎన్టీరామారావు ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అందులో నుంచే వచ్చిన మరో హీరో చైతన్య కృష్ణ. ఎన్టీరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడే చైతన్య కృష్ణ. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నెట్టింట్లో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. ఈ మధ్య కాలంలో నందమూరి చైతన్య కృష్ణ నటించిన చిత్రాలకు సంబంధించిన కొన్ని సీన్స్ విపరీతంగా ట్రోలింగ్ కు గురి అవుతున్నాయి.

చైతన్య కృష్ణ ఎక్స్ ప్రెషన్స్, ఫైట్స్, నడక వంటి ప్రతి అంశం పైన ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ప్రస్తుతం సమర సింహారెడ్డి సినిమా డైలాగ్స్ ను తనదైన స్టైల్ లో చెప్పి వైరల్ అయ్యాడు ఈ హీరో. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. నందమూరి చైతన్య కృష్ణ బ్రీత్ మూవీతో హీరోగా మారాడు అని తెలిసిందే. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అయింది.

కానీ ఈ సినిమా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య కృష్ణ ఇచ్చిన స్పీచ్, డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ జరిగింది. బ్రీత్ సినిమా ఒక రికార్డ్ సృష్టించింది. జీరో షేర్ అందుకున్న సినిమాగా నిలిచింది. అంతేకాదు ఈసినిమాకు ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదనే విమర్శలు వచ్చాయి. అయితే ఈయన రీసెంట్ గా సమరసింహారెడ్డి రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైతన్య కృష్ణ స్టేజ్ పైన డైలాగ్ చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఫాక్షన్ చిత్రాలు చేయడం బాబాయ్ వల్లే అవుతుందని.. ఆయనలా ఎవరు డైలాగ్స్ చెప్పలేరని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సమర సింహారెడ్డి మావీలోని నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అనే డైలాగ్ చెప్పడానికి చైతన్య తడబడ్డారు. పక్కన ఉన్న యాంకర్ ప్రాప్టింగ్ ఇచ్చినా చెప్పలేకపోయాడు. దీంతో పక్కన ఉన్నవారందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.