Mokshagna: బాలయ్య అదిరిపోయే స్కెచ్ .. మోక్షజ్ఞ ఎంట్రీ ఆ పాన్ ఇండియా డైరెక్టర్ చేతులు మీదుగా !

మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య కొత్త సినిమా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లొకేషన్ లో కూడా మోక్షజ్ఞ కనిపించాడు.

Written By: NARESH, Updated On : December 23, 2023 11:48 am

Mokshagna

Follow us on

Mokshagna: నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ … సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏపీ ఎలక్షన్స్ తర్వాత నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రం చేయనున్నారని టాక్. మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య కొత్త సినిమా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లొకేషన్ లో కూడా మోక్షజ్ఞ కనిపించాడు. శ్రీలీలతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేసాడు.

అయితే ఒకప్పుడు లావుగా ఉండే మోక్షజ్ఞ .. సినిమాల కోసమే తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య కొడుకు లాంచింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒక పాన్ ఇండియా డైరెక్టర్ బాలయ్య లైన్లో పెట్టినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఆ దర్శకుడు ఎవరంటే .. ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళితో మోక్షజ్ఞ పాన్ ఇండియా సినిమా తీస్తే ..హీరోగా ఇండస్ట్రీలో లైఫ్ సెటిల్ అయిపోతాడనే ఆలోచనలో బాలయ్య ఉన్నారట.

కొడుకుతో మూవీ గురించి మాట్లాడేందుకు బాలయ్య .. రాజమౌళిని కలిసారని తెలుస్తోంది. రాజమౌళి ఏకంగా బాలయ్య ఇంటికి వెళ్లి మీట్ అయ్యారట. బాలయ్య కాల్ చేస్తేనే రాజమౌళి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. మోక్షజ్ఞ ను రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య ప్రత్యేకంగా కోరారని తెలుస్తోంది. ఇక బాలయ్య ఆఫర్ కి రాజమౌళి కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి మోక్షజ్ఞతో ఎప్పుడు సినిమా తెరకెక్కిస్తాడు అని కొందరు అంటున్నారు.

ఒకవేళ నిజమైతే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఐతే రాజమౌళి లాంటి డైరెక్టర్ కొత్త హీరోలతో సినిమా తీయాలంటే కష్టమనే చెప్పవచ్చు. ఆయన రేంజ్ వేరు, స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తారు. ఈ క్రమంలో నిజంగా రాజమౌళి మోక్షజ్ఞ తో సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాస్తవం ఏదైనా.. న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.