Nandamuri Balakrishna: బాలయ్య బాబు లాంటి హీరో గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ శాసిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి కెరియర్ స్టార్టింగ్ లోనే వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాడు… విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు…ఇక బాలయ్య లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఒకసారి హిస్టారికల్ సినిమాని చేస్తాడు.
ఆ తర్వాత పౌరాణిక సినిమాలను సైతం ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు… బాపు డైరెక్షన్లో ‘శ్రీరామరాజ్యం’ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన రాముడు పాత్రలో నటించి మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తప్ప రాముడి పాత్రకి ఇంకెవరు సెట్ అవ్వరు అని చెప్పేవారు.
కానీ బాలయ్య మాత్రం ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ పాత్రను వేసి ప్రశంశలు అందుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత శ్రీరాముడి పాత్రను చేసి మెప్పించిన ఘనత కూడా బాలయ్య బాబుకే దక్కుతుంది… ఇక బాపు డైరెక్షన్లో బాలయ్య మరోసారి జతకట్టాలనే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో రాబోయే సినిమాలో బాలయ్య శివుడి పాత్రను పోషిస్తే బాగుంటుందని బాపు చెప్పారట.
తొందరలోనే ఆ సినిమాని స్టార్ట్ చేద్దామని చెప్పారట. ఇక ఇంతలోకే బాపుగారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా బాపు గారు బతికి ఉంటే మాత్రం బాలయ్యను శివుడి పాత్రలో శివతాండవం చేస్తున్నప్పుడు చూసే వాళ్ళం… ఆ పాత్రలో సైతం ఆయన నటించి మెప్పించేవాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…