Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను వదిలారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం 4 గంటల 26 నిమిషాలకు నట సింహం రాబోతున్నాడు అంటూ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ పై కూడా నటసింహం వస్తున్నాడు అనే మెసేజ్ నే హైలైట్ చేశారు కాబట్టి.. బహుశా బాలయ్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి అయితే, ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ‘మఫ్టీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి రీమేక్ అని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ శుక్రవారం నుంచి తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ ఫైట్ కి సంబంధించిన ఓ ఫొటో కూడా లీక్ అయ్యింది.
Also Read: తెలంగాణలో ముందస్తు ఎన్నకలు లేనట్లేనా?
ఆ ఫోటోలో బాలయ్య లుంగీలో ఊర మాస్ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ సినిమాలో సీమ ప్రాంతానికి దగ్గరగా జరుగుతుందట. బాలయ్య ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్స్ కొట్టాయి. అందువలన అదే నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి తొలిరోజు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బాలయ్యపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ లో బాగానే కసరత్తులు చేశాడు. ముఖ్యంగా బాలయ్య గెటప్ పై బాగా వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ హైలైట్ గా ఉంటుందట.

పైగా ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మరో 30 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు.
Also Read: గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా
[…] […]
[…] Car Driver Married College Student: కలికాలం అంటే ఏంటో అనుకున్నాం గానీ.. ఈ నడుమ జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని, సమాజం ఒప్పుకోని ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ అమ్మాయి చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారేమో. ఈ నడుమ ప్రేమ వివాహాలు చాలా కామన్ అయిపోయాయి. కాగా కర్నాటకలో కూడా ఇలాంటి ప్రేమ వివాహమే జరిగింది. కానీ ఇందులో ఉన్నన్ని ట్విస్టులు సినిమాలో కూడా ఉండవేమో. […]