Nandamuri Balakrishna Angry: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అభిమానులపై కోపం తెచ్చుకోవడం కొత్తేమి కాదు. ఇప్పటి వరకు ఆయన తన వద్దకు వచ్చే అభిమానులను కొట్టకుండా ప్రేమతో దగ్గరకు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. మంచి మూడ్ లో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రవర్తిస్తాడు. కానీ చిరాకు గా ఉన్న సమయం లో బాలయ్య ని ఎవరైనా కదిలిస్తే మాత్రం వాళ్లకు మూడినట్టే అనుకోవచ్చు. ఈరోజు కూడా అలాంటి ఘటనే జరిగింది. వచ్చే నెల 5వ తారీఖున విడుదల అవ్వబోయే ‘అఖండ 2’ మూవీ కి సంబంధించి నేడు వైజాగ్ లో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ కోసం వచ్చిన బాలయ్య ని విమానాశ్రయం నుండి ఘనంగా స్వాగతం పలకడానికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
అందులో ఒక అభిమాని ని చూసిన బాలయ్య ‘వీడేందుకు ఇక్కడకి వచ్చాడు..వెంటనే వెళ్ళగొట్టండి. ఈరోజు సాయంత్రం జరిగే ఈవెంట్ లో కూడా వీడు నాకు కనపడకూడదు’ అంటూ బాలయ్య ఆ అభిమాని పై రెచ్చిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బాలయ్య ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది?, ఆ అభిమాని గతం లో చేయరాని పని ఏమైనా చేశాడా?, లేదా నందమూరి ముసుగు లో బాలయ్య పై సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేశాడా?, అసలు బాలయ్య అభిమాని యేనా అతను?, లేదంటే కూటమి పార్టీ కి చెందిన వాడా? అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అసలు నిజం ఏమిటి అనేది తెలియడం ప్రస్తుతానికి కష్టమే. కానీ ఏది ఏమైనా బాలయ్య అభిమాని తో ఇలా ప్రవర్తించడం సరికాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అఖండ 2 విషయానికి వస్తే ఈ చిత్రం పై నందమూరి అభిమానుల్లోనే కాదు, ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే అఖండ వంటి సెన్సేషనల్ హిట్ కి సీక్వెల్ కావడం, అందులోనూ బోయపాటి శ్రీను తో ఆయన చేస్తున్న నాల్గవ చిత్రం కావడం. ఇప్పటికే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సరైన కంటెంట్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్లో గా ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో కేవలం టీజర్ మాత్రమే ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత విడుదలైన రెండవ యాక్షన్ టీజర్, రీసెంట్ గా విడుదలైన ‘అఖండ తాండవం’ టైటిల్ సాంగ్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. రాబోయే ప్రమోషనల్ కంటెంట్ అయినా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.