https://oktelugu.com/

Akhanda Amma Song: ‘అఖండ’ అమ్మ సాంగ్ అదరగొడుతుంది !

Akhanda Amma Song: నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. అయితే, ఈ సినిమాలో ‘అమ్మ’ అంటూ సాగే వీడియో సాంగ్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. ‘బుల్లెట్ బండి’ ఒరిజినల్ పాట పాడిన మోహన భోగరాజు ఈ పాటను పాడింది. తమన్ ఈ సాంగ్‌కు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 20, 2022 / 12:43 PM IST
    Follow us on

    Akhanda Amma Song: నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. అయితే, ఈ సినిమాలో ‘అమ్మ’ అంటూ సాగే వీడియో సాంగ్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. ‘బుల్లెట్ బండి’ ఒరిజినల్ పాట పాడిన మోహన భోగరాజు ఈ పాటను పాడింది. తమన్ ఈ సాంగ్‌కు మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సాంగ్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

    Akhanda Amma Song

    Also Read: ఇటు 50 రోజుల సెలెబ్రేషన్స్.. అటు ఓటీటీ రిలీజ్ వేడుకలు !

    నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. ఏది అయితే ఏం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన నటసింహం బాలయ్య తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా చాటుకున్నాడు. అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని.. ఈ సినిమా నిర్మాత కూడా ఊహించలేదు.

    దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా ఈ సినిమా నైజాం రైట్స్ ను చాలా తక్కువ ధరకే కొనుక్కున్నారు. మొత్తానికి దిల్ రాజుకు ఫుల్ లాభాలు వచ్చాయి. మొత్తానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ యాక్షన్ మూవీ అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. బాలయ్య స్టార్ డమ్ ఏమిటో బాక్సాఫీస్ కి మరోసారి ఘనంగా చాటి చెప్పింది.

    Also Read: వర్మ  ‘బాలయ్య షో’  పై చేసిన  ట్వీట్  ను ఎందుకు డిలీట్ చేశాడంటే.. ?

    Tags