Homeఎంటర్టైన్మెంట్Nandamuri Bala Krishna: దుమ్మురేపుతున్న బాలయ్య ... అన్ స్టాపబుల్ షో ప్రోమో ...

Nandamuri Bala Krishna: దుమ్మురేపుతున్న బాలయ్య … అన్ స్టాపబుల్ షో ప్రోమో …

Nandamuri Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ తనలోని తనలోని మరో యాంగిల్ ని ప్రేక్ష్స్కులకు పరిచయం చేయబోతున్నాడు. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో … ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు బాలయ్య. ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ ప్రొగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ ను ప్రారంభించనున్నారు.

nandamuri-bala-krishna-unstopable show promo released

కాగా తాజాగా ఈ ప్రోగ్రాం కు సంబంధించి పరిచయ వేడుక నిర్వహించారు. ఈ సంధర్భంగా బాలయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారని… అందుకే ఈసారి వారి ముందుకు వ్యాఖ్యతగా రాబోతున్నట్లు తెలిపారు. సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ అభిమానులను, ప్రేక్షకులను అలరించడమే తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఇప్పటికే విభిన్న పాత్రలు చేశానని, విభిన్న కథలు ఎంచుకున్నానని … ఇంకా ఎంతో చేయాలని తెలుగు జాతి ప్రేరణ ఇస్తోందని చెప్పారు. ఈ మేరకు షో ప్రోమో వీడియోను విడుదల చేశారు.

అలానే ‘ఆహా’ ఓటీటీ… అల్లు అరవింద్‌ కు మానస పుత్రిక అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ మొత్తంలో ఒక్క అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేదని పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ఎంతో మంది యువతీ యువకులు ఈ షో కోసం పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందని.. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయన్నారు. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో తనకు బాగా నచ్చిందని అందుకే ఒప్పుకొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular