HBD Namrata Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి ‘నమ్రతా శిరోద్కర్’ ఈరోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటుంది. నమ్రతా ప్రతి పుట్టినరోజు నాడు మహేష్ సోషల్ మీడియా వేదిక ఆమెకు ప్రత్యేక విషెస్ చెబుతూ.. ప్రతి ఏడాది ఆమె కోసం ప్రత్యేక వెకేషన్ ప్లాన్ చేస్తుంటాడు. ఐతే, ఈ ఏడాది రమేష్ బాబు మరణం కారణంగా నమ్రతా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు.

నమ్రతా మిస్ ఇండియానే కాదు, మిస్ యూనివర్స్ కూడా :
నమ్రతా బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టక ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. గెలిచి మిస్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. అలాగే మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నమ్రతా సత్తా చాటింది. మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్-6లో ఆమె చోటు దక్కించుకుంది. అదేవిధంగా మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లోనూ నమ్రతా రన్నరప్ గా నిలవడం విశేషం.
మహేష్ తో ఎలా జోడీ కుదిరింది !
నమ్రతా శిరోద్కర్ తెలుగులో హీరోయిన్ గా బిజీ అవుతున్న రోజులు అవి. మహేష్ బాబు అప్పుడే తన ‘వంశీ‘ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. అప్పటికీ మహేష్ కి గొప్ప స్టార్ డమ్ రాలేదు. అప్పట్లో మహేష్ చాలా సింపుల్ లైఫ్ స్టైల్ తో ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ‘వంశీ‘ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతాన కలిశాడు. అలా ఒకరికొకరు పరిచయం అయ్యాక.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. అలా చివరకు ఒక్కటి అయ్యారు.

మహేష్ తో పెళ్లి ఎప్పుడు అయింది !
మహేష్ సరసన వంశీ చిత్రంలో నటించిన తర్వాత.. నమ్రత సినిమాలను వదులుకుంది. మహేష్ ను 2005 ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. గౌతమ్ కృష్ణ, సితార పుట్టాక, మళ్లీ నమ్రత బిజినెస్ విమెన్ గా అవతారం ఎత్తింది.
Also Read: ఆ సంస్థపై ట్రోల్స్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!
మహేష్ కంటే.. నమ్రతా వయసులో పెద్దది !
అవును, వయసులో మహేష్ బాబు కంటే నమ్రతా శిరోద్కర్ నాలుగేళ్లు పెద్దది. అయితే, మొదట్లో వీరి వయసు పై అనేక కామెంట్స్ వినిపించేవి. ఓ దశలో.. అంటే పెళ్ళికి ముందు కృష్ణగారు కూడా ఇదే విషయాన్ని అడిగారని.. అది పెద్ద సమస్య కాదు అని మహేష్ ఆయనను కన్విన్స్ చేశాడని.. ఓ హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రతా ఓపెన్ అయ్యారు.
ఇక మహేష్ తో వివాహం చేసుకున్న తర్వాత నమ్రతా పూర్తిగా సినిమాలకు దూరమైయ్యారు. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాల్లో యాడ్స్, సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తమ్మీద టాలీవుడ్ క్రేజీ సెలబ్రిటీ జోడీల్లో మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట మొదటి స్తస్థానంలో ఉంటుంది.